స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందు ధర్నా (state bank of india mundhu dharna)

ఇరగవరం:

నాట్లు వేశాం…. పంటరుణాలు ఇవ్వండి అంటూ ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో స్ధానిక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందు కౌలురైతు ధర్నా నిర్వహించారు. కౌలురైతును ఆదుకోవాలటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నానుద్ధేశించి ఆంధ్ర ప్రదేశ్‌ కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ కౌలురైతు పంట రుణాపై ప్రభుత్వం కాకిలెక్కు చెబుతోందని విమర్శించారు. కష్టపడి పంటు సాగుచేస్తున్న కౌలురైతుకు చేతిలో చిల్లిగవ్వలేక కౌలురైతు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రుణ అర్హత గుర్తింపు కార్డు పొందిన కౌలురైతు బ్యాంకు చూట్టు కాళ్ళచెప్పు అరిగేలా తిరుగుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష వరకు వడ్డీ, హామీ లేకుండా పంటరుణం కౌలురైతుకు అందిస్తున్నాట్లు ఆర్భాట ప్రచారం చేసుకుంటోందని ఆచరణ అంతంత మాత్రమేనని అన్నారు. బ్యాంకుల్లో గత పంటరుణానే రెన్యువల్‌ చేస్తున్నారని కొత్తగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. బ్యాంకుకు స్పష్టమైన ఆదేశాలు పంపి కౌలురైతుందరికీ వడ్డీ లేని పంటరుణాలు ఇచ్చేలా చర్య చేపట్టాని డిమాండ్‌ చేశారు. కౌలురైతుకు పంట భీమా ప్రీమియం భారంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భీమా ప్రీమియం కౌలురైతుపేరున కట్టాలని కోరారు. బ్యాంకు కౌలురైతుకు పంటరుణం ఇవ్వకపోతే ఆందోళనను ఉధృత్తం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కౌలురైతు సంఘం నాయకు మండ వ్యవసాయ అధికారి రాజేంద్రప్రసాద్‌ సమక్షంలో బ్యాంకు మేనేజరుతో చర్చ జరపగా రుణాలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తామరపల్లి ముసయ్య, బొక్కా వెంకటరావు, పొట్ల బాయ్య, తొంపాకు చిన్నవీరన్న, టి కృష్ణ మూర్తి తదితయి పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *