30న ఏపి సెట్‌ పరీక్ష (ap set exams on 30th)

రాజమహేంద్రవరం :
ఈ నె 30వ తేది నుండి ఏపి సెట్‌ 2017 పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇందుకోసం ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి 13 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకుపతి ముర్రు ముత్యాలనాయుడు అన్నారు. గురువారం యూనివర్సిటీలోని ఏపి సెట్‌ పరీక్ష కేంద్రాకు సంబంధించి సూపరింటెండెంట్‌ సమావేశం జరిగింది. దీనిలో వీసీ ముత్యాలనాయుడు మాట్లాడుతూ పోస్టు గ్రాడియేషన్‌ ద్వారా మాత్రమే ఉద్యోగాలు వచ్చే కాలం ముగిసిందని ప్రతీ ఉద్యోగానికి ఇప్పుడు నెట్‌ లేదా సెట్‌లు తప్పనిసరి అయ్యాయని అన్నారు. కావున ఈ పరీక్షకు డిమాండ్‌ బాగా పెరిగిందని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి కేంద్రంగా 13 పరీక్ష కేంద్రాను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని 6623 మంది విద్యార్థు ఈ పరీక్షలు రాసేందుకు సిద్దపడుతున్నారని అన్నారు. ఎపి సెట్‌ పరీక్షు వ్రాసేందుకు వచ్చే అభ్యర్థు అడ్మిట్‌ కార్డుతో ఉదయం 09 గంటకు ఆయా పరీక్షా కేంద్రాకు హాజరు కావాన్నారు. విశాఖపట్నం, గుంటూరు జిల్లాతో పాటు ఇప్పుడు రాజమండ్రి కేంద్రంగా ఇంత మంది విద్యార్థు పరీక్ష వ్రాస్తుండడం ఉన్నత విద్యను అభ్యసించిన వారి ప్రాధాన్యతను తెలియజేస్తుందని తెలిపారు. విద్యార్థుందరు పరీక్షు మంచిగా వ్రాసి మంచి మార్కుతో ఉత్తీర్ణత సాధించాని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎ.పి సెట్‌ కోర్‌ కమిటి సభ్యుడు వెంకటేశ్వరరావు, రిజినల్‌ కో`ఆర్డినేటర్‌ పి.సురేష్‌ వర్మ, ఎన్‌.సూర్య, రాఘవేంద్ర తదిత పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *