మూవీ రివ్యూ: ‘గౌతమ్‌ నంద’ (gowtham nanda movie review)

మూవీ రివ్యూ: ‘గౌతమ్‌ నంద’
నటీనటులు: గోపీచంద్‌ – హన్సిక – కేథరిన్‌ థ్రెసా – సచిన్‌ ఖేద్కర్‌ – చంద్రమోహన్‌ – సీత – అజయ్‌ – తనికెళ్ల భరణి – వెన్నె కిషోర్‌ – బిత్తిరి సత్తి తదితలు
సంగీతం: తమన్‌
ఛాయాగ్రహణం: సౌందర్‌ రాజన్‌
నిర్మాతు: భగవాన్‌ – పుల్లారావు
రచన – దర్శకత్వం: సంపత్‌ నంది
‘లౌక్యం’ మినహాయిస్తే గత కొన్నేళ్లలో గోపీచంద్‌ కు సరైన విజయాల్లేవు. అతను చివరగా చేసిన ‘సౌఖ్యం’ చేదు అనుభవాన్ని మిగిల్చింది. మరోవైపు ‘రచ్చ’తో సత్తా చాటినప్పటికీ.. ‘బెంగాల్‌ టైగర్‌’ ఆశించిన ఫలితాన్నివ్వని నేపథ్యంలో దర్శకుడు సంపత్‌ నంది కూడా మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా ‘గౌతమ్‌ నంద’. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గౌతమ్‌ నంద’ విశేషాలేంటో చూద్దాం.
కథ:
గౌతమ్‌ (గోపీచంద్‌) ఓ బిలియనీర్‌. ఐశ్వర్యంలో పుట్టి అందులోనే పెరిగిన అతడికి ఓ దశలో జీవితం మీద విరక్తి పుడుతుంది. నిజమైన ప్రేమకు.. భావోద్వేగాకు తావు లేని తన జీవితాన్ని చాలించానుకుంటాడు. మరోవైపు అచ్చం గౌతమ్‌ లాగే ఉండే నందకిషోర్‌ బస్తీలో పుట్టి పెరుగుతాడు. అతడికి అనేక ఆర్థిక సమస్యలు. దీంతో అతనూ చనిపోవాలనుకుంటాడు. ఆ సమయములోనే గౌతమ్‌-నంద ఎదురుపడతారు. ఇద్దరూ ఒకరి స్థానాల్లోకి ఇంకొకరు వెళ్లాలనుకుంటారు. అప్పుడు ఆ ఇద్దరికీ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. వీళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి అన్నది మిగతా కథ.
కథనం – విశ్లేషణ:
‘గౌతమ్‌ నంద’లో ఓ కీలక సన్నివేశం గురించి మాట్లాడుకుందాం. ఒకేలా ఉండే గౌతమ్‌-నంద తమ ఐడెంటిటీల్ని మార్చుకుంటారు. ఒకరి స్థానాల్లోకి ఇంకొకరు వెళ్తారు. కానీ డబ్బున్నోడి ఇంట్లోకి వెళ్లిన బస్తీ వాడు అక్కడే సెటిలైపోవాని అనుకుంటాడు. అసువాడొచ్చి అక్కడున్నవాడు నకిలీ.. నేను ఒరిజినల్‌ అన్నా ఆ ఇంట్లో ఉన్నవాళ్లెవ్వరూ నమ్మరు. చివరికి అతడి తల్లిదండ్రు కూడా. దీంతో అతను నిస్సహాయుడైపోతాడు. ఐతే 30 ఏళ్లు ఆ ఇంట్లో పెరిగిన వాడు.. ఆ ఇంట్లో తన జ్నాపకా గురించి.. తన తల్లిదండ్రుతో తనకున్న అనుభవా గురించి గుర్తు చేసి.. నకిలీ వాడిని పట్టించేయడం ఎంత సేపు? కానీ సంపత్‌ నంది ఇంత చిన్న లాజిక్‌ కూడా పట్టించుకోలేదు. సినిమాకు కీలకమైన సన్నివేశం ఇలా ఉంటే జనా ఫీలింగ్‌ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కవలలు కాకుండా ఒకరితో ఒకరికి సంబంధం లేని ఇద్దరు ఒకేలా ఉండటం అన్నదే లాజిక్‌ కు అందని విషయం. ఇక వాళ్లిద్దరూ అనుకోకుండా కలవడం.. ఒకరి స్థానంలోకి ఇంకొకరు వెళ్లడం.. వాళ్ల కుటుంబ సభ్యులు వీళ్లను ఏమాత్రం గుర్తు పట్టకపోవడం.. ఇవన్నీ కూడా అసహజమైన.. లాజిక్‌ లేని విషయాలే. కాకపోతే కమర్షియల్‌ సినిమాల్లో ఇలాంటి లాజిక్కుల్ని జనాలు పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి వాటికి మన ప్రేక్షకులు ఎప్పుడో అలవాటు పడిపోయారు. ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఆదరణ పొందాయి. కాకపోతే జనాలు లాజిక్కు గురించి పట్టించుకోకపోవడం అన్నది ఒక దశ వరకే ఉంటుంది. కానీ పైన చెప్పుకున్న మాదిరి కథకు కీలకమైన సన్నివేశాన్ని కూడా అలా నడిపిస్తేనే జనాలకు ఇబ్బందిగా ఉంటుంది. ‘గౌతమ్‌ నంద’లో ప్రొడక్షన్‌ వ్యాలుస్‌ కు తిరుగులేదు. సినిమా అంతటా భారీతనానికి లోటు లేదు. నిర్మాతు బోలెడంత ఖర్చు పెట్టేశారు. హీరో గోపీచంద్‌ పెరామెేన్స్‌ పరంగా అదరగొట్టేశాడు. హీరోయిన్లు గ్లామరసం ఒకబోసేశారు. తమన్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ తో చితగ్గొట్టేశాడు. కెమెరామన్‌ కూడా రిచ్‌ విజువల్స్‌ తో మెప్పించాడు. పాటు.. యాక్షన్‌ సీన్స్‌ కూడా ఓకే. కానీ ఈ అదనపు ఆకర్షణ సంగతి పక్కనబెట్టేసి అసు విషయం చూస్తేనే తీవ్ర నిరాశ తప్పదు. దర్శకుడు సంపత్‌ నందికి తనకు కావాల్సినవన్నీ భించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రొటీన్‌ కథాకథనాతో ‘గౌతమ్‌ నంద’ను సాదాసీదా సినిమాగా మార్చేశాడు. ఒక మంచి అవకాశాన్ని వ ృథా చేసుకున్నాడు. ఓ దశ వరకు కథను మామూుగా నడిపించి.. ఉన్నట్లుండి ట్విస్టు ఇచ్చి ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేయడం టాలీవుడ్లో చాలామంది దర్శకు వేస్తున్న ఎత్తుగడ. సంపత్‌ నంది కూడా ‘గౌతమ్‌ నంద’లో అదే ట్రిక్‌ ప్లే చేశాడు. కానీ ఆ ట్విస్టు థ్రిల్‌ ఆ సమయానికి కొంచెం థ్రిల్‌ చేస్తుంది కానీ.. అది ప్రేక్షకుకు మింగుడుపడదు. ఈ రొటీన్‌ సినిమాలో అసలా ట్విస్టు సింక్‌ కాలేదసు. ఈ ట్విస్టు మినహాయిస్తే ‘గౌతమ్‌ నంద’లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. బ్రీఫ్‌ గా చెప్పాల్సిన కథను సుదీరెంగా రెండున్నర గంటు చెప్పడం.. రొటీన్‌ సన్నివేశాతో బోర్‌ కొట్టించేయడం.. ‘గౌతమ్‌ నంద’కు పెద్ద ప్రతికూతగా మారింది. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి.. నిజమైన సంతోషానికి దూరమైపోయానని భానవతో ఉన్న వ్యక్తి.. తన ఇంటి పేరు.. తన తండ్రి పేరు లేకుండా ‘తాను’ ఏంటో తొసుకునే ప్రయత్నంలో పడటంతో మొదవుతుంది ‘గౌతమ్‌ నంద’ కథ. ఈ ఆరంభం చూస్తే ఒక వైవిధ్యమైన సినిమా చూడబోతున్నామన్న భావన కుగుతుంది. కానీ అంతలోనే ఈ హీరోలాగే ఇంకొకడుండటం.. ఇద్దరూ ఒకరి స్థానాల్లోకి ఇంకొకరు వెళ్లడం.. ఇలా రొటీన్‌ కమర్షియల్‌ దారిలోకి వచ్చేస్తుంది ‘గౌతమ్‌ నంద’. ఐతే స్లమ్‌ లో ఉండే రెండో హీరో నేపథ్యం.. బస్తీలో వచ్చే సన్నివేశావీ కొంచెం వినోదాత్మకంగా ఉండటంతో బండి సోసోగా నడుస్తున్నట్లే ఉంటుంది. ప్రథమార్ధం వరకు ఏదో అలా సాగిపోతుంది. కానీ ద్వితీయార్ధంలోకి వచ్చాక ‘గౌతమ్‌ నంద’ విసిగించడం ప్రారంభిస్తుంది. ఇటు గౌతమ్‌.. అటు నంద.. ఇద్దరూ కూడా బోర్‌ కొట్టించేస్తుంటారు. అక్కడ అతను ఐశ్వర్యాన్ని ఆస్వాదించడం తప్పితే ఇంకేమీ చూపించరు. ఇక్కడ ఇతను బస్తీలో మనుషుతో ఎమోషనల్‌ గా కనెక్టయ్యే సన్నివేశాలు కూడా రొటీన్‌ గానే ఉంటాయి. ఓ దశ దాటాక రిపిటీటివ్‌ గా అనిపించే సన్నివేశాు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. సినిమా ఎటు పోతోందో అర్థం కాని సందిగ్ధత మొదలవుతుంది. దశలో వచ్చే ట్విస్టు కూడా ప్రేక్షకుల్ని ఏమంత థ్రిల్‌ చేయదు. ముగింపు కూడా అంత మెప్పించదు. పైన చెప్పుకున్నట్లే అదనపు ఆకర్షణు మెప్పించినా.. కథాకథనా పరంగా మాత్రం ‘గౌతమ్‌ నంద’ నిరాశపరిచాడు.
నటీనటులు:
పెర్ఫామెన్స్‌ విషయంలో గోపీచంద్‌ కెరీర్‌ బెస్ట్‌ సినిమాల్లో ‘గౌతమ్‌ నంద’ ఒకటిగా చెప్పుకోవచ్చు. సినిమాలో అతడిది వన్‌ మ్యాన్‌ షో. పూర్తి విరుద్ధమైన గౌతమ్‌-నంద పాత్రల్లో అతను మెప్పించాడు. వైవిధ్యం చూపించాడు. బిలియనీర్‌ పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్‌.. నటనతో అతను మ్పెరిచాడు. బస్తీ కుర్రాడిగానూ మెప్పించాడు. ఈ పాత్ర కోసం కొంచెం లుక్‌ మార్చుకోవాల్సింది. ట్విస్టు రివీయ్యాక వచ్చే సన్నివేశాల్లో గోపీచంద్‌ అదరగొట్టేశాడు. కాకపోతే గోపీచంద్‌ను ఇలాంటి పాత్రలో.. సన్నివేశాల్లో చూడటం ఏదోలా అనిపిస్తుంది. హీరోయిన్లలో కేథరిన్‌ థ్రెసా తన గ్లామర్‌ తో మతి పోగొడుతుంది. నటన మామూలే. హన్సిక బస్తీ అమ్మాయి పాత్రకు సూటవ్వలేదు. ఆమె నటన జస్ట్‌ ఓకే అనిపిస్తుంది. తనికెళ్ల భరణి కనిపించేది ఒక్క సీన్లోనే అయినా ఆకట్టుకున్నాడు. చంద్రమోహన్‌ పేద తండ్రి పాత్రలో మరోసారి జీవించేశాడు. సీత కూడా బాగా చేసింది. నెగెటివ్‌ రోల్స్‌ లో అజయ్‌.. ముకేష్‌ రుషి.. నికితిన్‌ ధీర్‌.. వీళ్లంతా మామూలే. సచిన్‌ ఖేద్కర్‌ కు పెద్దగా నటించే అవకాశం దక్కలేదు. ఆయనది అంత ప్రాధాన్యం లేని పాత్ర. వెన్నె కిషోర్‌.. బిత్తిరి సత్తి కనిపించేది తక్కువ సన్నివేశాల్లోనే అయినా నవ్వించారు.
సాంకేతికవర్గం:
‘గౌతమ్‌ నంద’ టెక్నికల్‌ గా మెప్పిస్తుంది. రిచ్‌ ప్రొడక్షన్‌ వ్యాూస్‌ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సినిమా అంతటా ఒక భారీతనం కనిపిస్తుంది. పెద్ద స్టార్‌ హీరో సినిమా స్థాయిలో దీన్ని చాలా రిచ్‌ గా తెరకెక్కించాడు సంపత్‌. అందులోని లొకేషన్లు ఆకట్టుకుంటాయి. సౌందర్‌ రాజన్‌ ఛాయాగ్రహణం మెప్పిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాల్ని చాలా బాగా తీశాడు. తమన్‌ సంగీతం ఓకే. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో అదొకటి. సినిమాకు మైనస్‌. అనవసర సన్నివేశాలు.. పాటు సినిమాను దెబ్బ తీశాయి. దర్శకుడు సంపత్‌ నంది.. ఇప్పటిదాకా తీసిన మూడు సినిమాలు రొటీనే కానీ.. వాటిలో ఎంటర్టైన్మెంట్‌ ఉండేది. కథనంలో వేగమూ ఉండేది. కానీ ఇందులో అతను అలా ఎంటర్టైన్‌ చేయలేకపోయాడు. ఆ స్పీడు చూపించలేకపోయాడు. ప్రధానంగా ట్విస్టును నమ్ముకున్న అతను మిగతా కథనాన్ని మరీ రొటీన్‌ గా లాగించేశాడు. అతను ప్రధాన పాత్రల్నే సరిగా తీర్చిదిద్దుకోలేదు. స్క్రీన్‌ ప్లే సినిమాకు మైనస్‌ అయింది. కనీసం ద్వితీయార్ధంలో సంపత్‌ మార్కు ఎంటర్టైన్మెంట్‌ ఉండి.. అనవసర సన్నివేశాలకు కోత పెట్టి ఉంటే ‘గౌతమ్‌ నంద’ మెరుగ్గా ఉండేదేమో.
రేటింగ్‌- 2.25/5

 

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *