త్రాగునీరుకు ఇబ్బందు కలుగకుండా చర్యలు (fight on drinking water probleam)

రాజమహేంద్రవరం:
నగరంలో త్రాగునీరుకు ఇబ్బందు కలుగ కుండా అన్నిచర్య తీసుకుంటున్నామని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు డాక్టర్‌ ఆకుల సత్య నారాయణ అన్నారు. శనివారం జాంపేట మార్కెట్‌ వద్ద త్రాగునీరు పైపులైను పనకు శంఖుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాతపైపులైనువన త్రాగునీరు పంపింగ్‌లో కొన్ని ఇబ్బం దు వున్నాయని వాటిని అధిగ మించి పూర్తిస్థాయిలో త్రాగునీరు అందించుటకు అన్నిఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. వీటిలో భాగంగా 14వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరు కాబడిన రూ.49 లక్షతో సెంట్రల్‌ విజటబుల్‌ మార్కెట్‌ వద్దనుండి జాంపేట మార్కెట్‌వరకు పైపులైను రీప్లెస్‌ మెంటుచేసేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో ప్రజందరికి పూర్తిస్థాయిలో త్రాగునీరు అందించగందుకు కార్యచరణ రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా అద్దెపల్లి కానీ నందు 13వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరు కాబడిన రూ. 25 లక్షతో పైపులైను రిపేరు మరియు కొన్నిచోట్ల కొత్తవి వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా కార్యక్రమంలో పాల్గోన్న నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం వలన మంచి ఆరోగ్యవంతులుగా వుంటారని ప్రజందరికి పరిశుభ్రమైన త్రాగునీరు అందించగగుతున్నామని తెలిపారు. పాతపైపులైన్లు ఉన్నప్రాంతంలో కొత్తపైపులైన్లు వేయుటకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రోడ్లు, డ్రైన్లు ఆధునీకరించడం జరుగుతుందని అదేవిధంగా పాతపైపులైన్లు అన్నింటిని మార్చవలసిన అవసరం ఉందని తెలిపారు. అన్నివార్డులో పూర్తిస్థాయిలో త్రాగునీరు అందించుటకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. పైపులైన్లు వలన ఎక్కడ లీకేజీలు లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు శ్రీమతి ద్వారా పార్వతిసుందరి, యం.శ్రీనివాసరావు, కె.సతీష్‌, ఇ.ఇ.ు జి.పాండురంగారావు, శ్రీమతి సత్యకుమారి, డి.ఇ.ు సి.వెంకటేశ్వరరావు,పి.రామారావు మరియు యం.జయప్రకాష్‌ తదితరులుపాల్గోన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *