అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యపై బస్సుయాత్ర

రాజమహేంద్రవరం

సంవత్సరాల తరబడి కావస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలు పరిష్కారం కాలేదని వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి తీవ్రతరం చేసేందుకు ఆగష్టు 15నుండి అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ మరియు ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుండి బాధితుల చైతన్య యాత్ర ప్రారంభమౌతుందని దీనిని అన్నివర్గా వారు జయప్రదం చేయాలని యూనియన్‌ జిల్లా గౌరవ సహాదారులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ కార్యాయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల అవగాహన సదస్సు అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫెర్‌ అసోషియేషన్స్‌ జిల్లా అధ్యక్షులు పురెడ్ల శేషకుమార్‌ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉందనే నెపంతో కేసును నిర్వీర్యం చేస్తున్నారని కొద్ది మందిని అరెస్టు చేసి కేసును ప్రక్కదారి పట్టిస్తున్నారని, దీని వల్ల లక్షలాది మంది  కస్టమర్లు ఆందోళన చెందుతున్నారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే అందరి ఖాతాల్లో డబ్బు వేయాలని, చంద్రబాబు రాజకీయ డ్రామాలు ప్రక్కన పెట్టి 2018 నాటికి ఈ సమస్యను పరిష్కారం చేయకుంటే 2019లో ప్రజలు తమ సత్తాను చూపుతారన్నారు. సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు చివరి పైసా వచ్చే వరకు సీపీఐ సమరశీ పోరాటాలు నిర్వహిస్తుందని బాధితులకు అండగా సీపీఐ తప్ప ఇంకే రాజకీయ పాత్ర లేదని బాదితుల చైతన్య యాత్రకు కార్మిక విద్యార్థి, కర్షక సంఘాలు నిుస్తాయని ప్రభుత్వం మెండివైఖరి విడనాడి ఖాతాదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బిఐసిఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా కిషోర్‌, అగ్రిగోల్డ్‌ బాదితులు గోపి, రమణ, షరీప్‌ పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *