కౌలురైతులకు పంటరుణాలు ఇవ్వండి

ఉంగుటూరు:

నాట్లు వేశాం…పంటరుణాలు ఇవ్వ ండి అంటూ ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో కైకరం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ముందు సోమవారం కౌలురైతుల ధర్నా నిర్వహించారు. కౌలురైతుల పట్ల ఎస్‌బిఐ అధికారుల నిర్లక్ష్యంపై పెద్దఎత్తున నినాదాలు చేశారు. బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నామంటూ కౌలురైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నానుద్దేశించి ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తి కొండ వెంకటకృష్ణారావు మాట్లాడారు. కౌలురైతు పంటరుణాలపై ప్రభుత్వం కాకిలెక్కులు చెబుతోందని విమర్శించారు. కాళ్లచెప్పు అరిగేలా బ్యాంకు చుట్టూ తిరుగు తున్నా పంటరుణాలు ఇవ్వటం లేదన్నారు. చట్ట విరుద్దంగా పంటసాగు చేయనివారికి పంటరుణాలు ఇస్తూ కౌలురైతులకు మొండిచెయ్యి చూపడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ కౌలురైతులకు రూ లక్ష పంట రుణం ఇవ్వనే ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయశాఖ జెఎల్‌ గ్రూపు ఏర్పాటు చేసినా కైకరం ఎస్‌బిఐలో కౌలురైతుకు పంటరుణాలు ఇవ్వటం లేదన్నారు. పైగా ప్రభుత్వ ఆదేశాలు లేరంటున్నారని చెప్పారు. చట్టవిరుద్దంగా కైకరం ఎస్‌బిఐలో పంటువేయ నివారికి ఇచ్చిన రుణాలపై సమగ్ర విచారణ జరపాని కోరారు. కౌలురైతులకు పంటరుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బ్యాంకుకు తాళాలు వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొర్ని అప్పారావు, పి దుర్గబాబు, పి రాంబాబు, ఎం సతీష్‌, కె వెంకటేశ్వరరావు, ఎన్‌ బాలాజీ, ఎల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి ప్రసాద్‌ సమక్షంలో బ్యాంకు అధికారుతో చర్చలు జరిపారు. స్పష్టమైన ఆదేశాలు లేవని చెప్పటం ఎల్‌డిఎంతో ఫోన్‌లో స్పందించగా ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. బ్యాంకు మేనేజర్‌ సెలవుతో ఉండటం వానితో మాట్లాడతామని చెప్పారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *