డాక్టర్‌ అయ్యి తీరుతా అంటోంది

మలయాళం సినిమా ప్రేమమ్‌ దాదాపుగా సౌత్‌ యూత్‌ అంతా చూసే ఉంటారు. అందరూ ఆ సినిమా చూసి ఒకే అమ్మాయి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సాయి పల్లవి ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ అయిపోయింది. అదే క్రేజ్‌ తో ఇక్కడ తెలుగులో కూడ నటించి అందరిని మెప్పించింది. తన తాజా సినిమా ఫిదాతో తెలుగులో మాంచి ఫాలోయింగ్‌ సంపాదించింది. కాకపోతే సాయి పల్లవి మనసు నటన మీద లేదు తెలుసా?? మనం చాలసార్లు స్టార్లు చెప్పగా వింటూనే ఉంటాం నేను డాక్టర్‌ కావాలి అనుకున్న కానీ యాక్టర్‌ అయ్యాను అని. ఇలా చెప్పే వాళ్ళు చిన్నప్పుడు డాక్టర్‌ అవుదాము అనుకుని ఉంటారు కానీ ఏదో ఛాన్స్‌ రావడం వలన యాక్టర్‌ అవుతూ ఉంటారు. కానీ సాయి పల్లవి విషయంలో నిజంగానే డాక్టర్‌ చదివి నటిగా అవకాశం వస్తే ఇలా హీరోయిన్‌ అయిపోయింది. ఇప్పుడు సౌత్‌ సినిమాలో స్టార్‌ అయ్యింది. ‘‘నేను డాక్టర్‌ కావాలి అనేది నా కల ఎప్పటికైనా నేను డాక్టర్‌ అయితీరుతాను అంటుంది. ఈ మధ్యలో ఏదో అవకాశం వచ్చింది కాబట్టి చేస్తున్నా’’ అని చెప్పింది. అందరి లాగానే ఈమె కూడ డాక్టర్‌ కావాలి అనుకోని యాక్టర్‌ అయ్యింది. కానీ ఈమె కథలో కొత్తదనం ఏంటంటే మళ్ళీ డాక్టర్‌ మాత్రమే అవుతాను అనడం. సాయి పల్లవి జార్జియాలో ఎంఎంబిఎస్‌ చదివింది. ఆమెకు శాస్త్రీయ న ృత్యం కూడా వచ్చు. అంతకంటే ముందు డ్యాన్సులో కూడా శిక్షణ తీసుకుని అనేక డ్యాన్సింగ్‌ షోలో పాల్గొంది. ఇక తదుపరి ఈ అమ్మడు నాని సినిమా మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. నాని ఇప్పటికే తన నేచురల్‌ నటనతో తొగు ప్రేక్షకులకు నచ్చిన నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఆ నేచురల్‌ కి ఈ నేచురల్‌ అందం జతకడితే ఎలా ఉండబోతుందో అని సాయి పల్లవి అభిమాను ఊహించుకుంటున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *