పాఠశాల రుణం తీర్చుకుంటున్న పూర్వ విద్యార్థులు

  • అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావటానికి చదివిన విద్యాయమే కారణం
  • `పాఠశా రుణం తీర్చుకుంటున్న పూర్వ విద్యార్థులు
  • `డా.ఆర్‌.ఎన్‌.ఆర్‌కాటన్‌, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహాను ఆవిష్కరించిన చాముండేశర్‌నాథ్‌

రాజమహేంద్రవరం

స్థానిక మంగళవారపుపేటలోని ట్రైనింగ్‌ మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం నాడు కాటన్‌, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యఅతిథిగా వి. చాముండేశ్వర్‌నాథ్‌ హాజరైనారు.  విగ్రహా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ నేను అంతర్జాతీయ స్థాయిలో ఎదిగానంటే తాను చదివిన విద్య అని, పూర్వ విద్యార్థులైన స్నేహితుందరితో సరదాగా కాసేపు ముచ్చటించారు.  పాఠశాలకు పూర్వ విద్యార్థులు తీర్చుకుంటున్న రుణాన్ని అభినందిస్తూ తొలి విడతగా లక్ష రూపాయాల విరాళాన్ని ప్రకటించారు.  అదేవిధంగా భవిష్యత్తులో తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.   విశాల దృక్ఫథంతో తమ సంస్కరణ ద్వారా చరిత్రలో నిలిచిపోయిన మహనీయును కీర్తిస్తూ, వారి వివరాల్ని విగ్రహాతో పాటు ఏర్పాటు చేసి విద్యార్థులకు తెలియచెప్పుతూ చరిత్ర సాధించిన ప్రభుత్వ పాఠశాల తమదేనని అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయు డా. రాచర్ల నాగేశ్వరరావు ఆహుతుల కరతాళ ధ్వనుల మధ్య అన్నారు.  అపర భగీరథుడు, ఉభయగోదావరి, డెల్టా జిల్లాకు నీరందించి ఆయా ప్రాంతాలను సస్యశ్యామం చేసి, ఆహార కొరతను తీర్చిన ఘనత సర్‌ ఆర్థర్‌ థామస్‌ కాటన్‌కే దక్కుతుందని, ఇప్పటికీ ప్రజు దేవుడిగా పూజిస్తున్నారని ఆయన కొనియాడుతూ అందులో భాగంగానే విద్యాలయ ప్రాంగణంలో కాటన్‌ విగ్రహంతోపాటు గురువుకే గురువైన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహాల్ని స్థాపించడం జరిగిందని అందుకు పూర్వ విద్యార్థులు కృషేనన్నారు.  పాఠశాల కీర్తి ప్రతిష్టల్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ పూర్వ విద్యార్థులు నిబెట్టడం తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు.  పాఠశాల కో.ఆప్షన్‌ మెంబర్‌ కోడూరి విఠోభా మహారాజ్‌, చక్కా త్రినాథ్‌ ఆధ్వర్యంలో తాము చదివిన పాఠశాల విద్యారుణాన్ని తీర్చుకుంటున్న తీరు తనను కదిలించిందని, పాఠశాల విద్యా ప్రమాణా స్థాయి పెరిగిందని ఆయన అన్నారు.  తమ పాఠశాలలో తల్లిదండ్రులు లేని, కటిక పేదవారు, హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తుల పిల్లలు కూడా చదువుతూ నూటికి 99శాతాన్ని సాధిస్తున్నారని ఆయన ఉద్వేగంగా చెప్పారు.  ముగ్గురు గురువుల ఆశీస్సులతో స్నేహితుల సమక్షంలో వి. చాముండేశ్వర్‌నాథ్‌ని సత్కరించిన అనంతరం ముగ్గురు గురువుల్ని పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వై. జగన్నాథరావు, ఎస్‌. భావన్నారాయణ, జి.వి.ఎస్‌.ఎల్‌.ఎన్‌. ఆచారి, డాక్టర్‌ శాంతారామ్‌,  డాక్టర్‌ డి.బుద్ధుడు, గాదె కిషోర్‌, ఇన్నమూరి రాంబాబు, డాక్టర్‌ పిల్లాడి పరమహంస, దువ్వూరి సత్యనారాయణ మరియు పూర్వ విద్యార్థు, 25వ వార్డు మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌ పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *