బిగ్‌ బాస్‌లో కొత్త అందం

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా తెలుగులో మొదలైన రియాలిటీ టివి షో ఇప్పుడిప్పుడే కొంచం ఆసక్తి గా మారుతోంది. ఇప్పుడు బిగ్‌ బాస్‌ షోకి వైల్డ్‌ కార్డ్‌ ఉపయోగించి మొదటి కంటెస్టంట్‌ బిగ్‌ బాస్‌ ఇంటిలోకి తీసుకువచ్చే సమయం వచ్చింది. ఈ షో మొదలై రెండు వారాలు అయ్యింది. కానీ ఇంత వరకు ఎటువంటి ముపు జరగలేదు. వైల్డ్‌ కార్డ్‌ తో ఒక సినిమా అందాన్ని బిగ్‌ బాస్‌ ఇంటిలోకి తీసుకుని వెళ్లబోతున్నారు. దీక్షా పంక్త్‌ అనే చిన్న హీరోయిన్‌ బిగ్‌ బాస్‌ లోకి రాబోతుంది. దీక్షా ‘గోపా గోపా’ లో దొంగ మాతగా నటించింది. ఇంకా ‘ఒక లైలా కోసం’ సినిమాలో కూడా నటించింది. అలాగే ధనరాజ్‌ హీరోగా చేసిన ‘బంతి పూ జానకి’ సినిమాలో హీరోయిన్‌ గా కూడా కనిపించింది. ఈమెకు తెలుగులో మంచి పట్టు ఉందట.. అందుకే కాబోలు ఇప్పుడు ఈమెను బిగ్‌ బాస్‌ ఇంటిలోకి తీసుకురాబోతున్నారు. పైగా గ్లామర్‌ కూడా దట్టిస్తుందని వారి ఆశ. ఈమె ఎంట్రీ పక్కన పెడితే కామిడీ యాక్టర్‌ ధనరాజ్‌ బిగ్‌ బాస్‌ షో ద్వారా మంచి ఫేమస్‌ అయ్యాడు. బిగ్‌ బాస్‌ షోలోకి ఇప్పుడు దీక్షా పంక్త్‌ వస్తే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి. షో ఎలా ఉన్నా కూడా అందం మాత్రం రాబోతుంది అని అర్ధం అవుతుంది.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *