ముగిసిన బాబు, పవన్‌ ఏకాంత భేటీ

అమరావతి:

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏకాంత భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ ఏకాంత భేటీలో ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమ స్యతో పాటు, పోలవరం, రాజధాని నిర్మాణం, మంజునాథ కమిషన్‌ నివేదిక అంశాలు చర్చకు వచ్చినట్టు తొస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాపైనా వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. అమరావతి నిర్మాణానికి ఈ మూడేళ్లలో తీసుకున్న చర్యను సీఎం చంద్రబాబు.. పవన్‌కు వివరించినట్టు సమాచారం. కాపు రిజర్వేషన్లపై చర్యలు ముమ్మరం చేసిన విషయాన్ని ఆయన ద ృష్టికి తీసుకెళ్లినట్టు తొస్తోంది.

పవన్‌ చొరవ ముదావహం: సీఎం
ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చొరవ తీసుకోవడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య 30 ఏళ్లుగా పీడిస్తూనే ఉందని, సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందన్నారు. హార్వర్డ్‌ వైద్య బ ృందం సూచన పరిగణనలోకి తీసుకుంటామని సీఎం స్పష్టంచేశారు. కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం కను గొంటామన్నారు. వ్యాధిగ్రస్తుకు ఉపశమనం కల్గించే అనేక చర్యు ప్రభుత్వం తీసుకుందన్నారు.

హార్వర్డ్‌ వైద్య బృందంతో సీఎం భేటీ
ఏకాంత భేటీ అనంతరం హర్వర్డ్‌ ప్రొఫెసర్లు, వ్కెద్యు బ ృందంతో కలిసి పవన్‌ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో మంత్రి కామినేని శ్రీనివాస్‌, వ్కెద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలపై వ్కెద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య హార్వర్డ్‌ వ్కెద్య బృం దానికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

మంచిపని ఎవరు చేసినా అభినందించాల్సిందే-మంత్రి కామినేని శ్రీనివాస్‌
ప్రజలకు మంచి జరిగే పని ఎవరూ చేసినా అభినందించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో పవన్‌కల్యాణ్‌కు ఆయన ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌, హార్వర్డ్‌ వర్శిటీ బ ృందం ఉదయం 10.30 గంట నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు సీఎం చంద్ర బాబుతో సమావేశమవుతారని తెలిపారు. ఉద్దానం సమస్యకు రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఉద్దానం సమస్య పూర్తిస్థాయి పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *