సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం

ఏలూరు –

ఆంద్రప్రదేశ్ సమాచార హక్కు సంఘం ఆధ్వర్యంలో సమాచార
హక్కు చట్టం అవగాహన కార్యక్రమం ఆర్,ఆర్,పేట సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆచంట వెంకటేశ్వరరావు అధ్యక్షతన  జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నూతన సభ్యులు సంఘంలో చేరారు. సమావేశంలో ముఖ్య అతిధి రాష్ట్ర  అధ్యక్షులు గొల్లపల్లి మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సమావేశ కమిషనర్ల నియామకం చేపట్టాలన్నారు. సంఘ గౌరవాధ్యక్షులు కోలాభాస్కరరావు సహచట్టం పై అవగాహన కల్పిస్తూ, చట్టం గురించి ప్రజలకు తెలిసేలా విరివిగా అవగాహన సదస్సులు అన్నిచోట్లా నిర్వహించాలన్నారు. సహచట్టం ప్రజల చేతిలో వజ్రాయుధమని, సహచట్టం ద్వారా అవినీతిని అంతమొందించ వచ్చని భాస్కరరావు అన్నారు. నూతనంగా చేరిన సభ్యులు అత్తిలి రాము, మెతకమేల్లి శ్రీనివాసరావు, సీల సూరిబాబు, కె.ఈ.వి.సత్యనారాయణలకు సంఘ ప్రతినిధులు నియామక పత్రాలు అందించారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు దళపతి రాజు శ్రీనివాసరాజు,జిల్లా ఉపాధ్యక్షులు వి.వి.ఎస్.రామారావు, జిల్లా కార్యదర్శి డా.తిరుపతిరావు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *