ఎంఆర్‌ వ్యాక్సిన్‌తొ తట్టు, రుబెల్లా దూరం

ప్రజలకు అవగాహన కలిగించిన హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు పెద్దిరెడ్డి ప్రదీప్‌
ఏలూరు:

హేలాపురి డైమండ్‌ యన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు పెద్దిరెడ్డి ప్రదీప్‌ ఆధ్వర్యంలో సోమవారం మీజిల్స్‌ (తట్టు) రూబెల్లా వ్యాక్సిన్‌ పై నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు అవగాహన కలిగించారు. సోమవారం శ్రీరామ్‌ నగర్‌లోని జింగల్‌ బెల్స్‌ స్కూల్‌ విద్యార్థలతో కలిసి శ్రీరామ్‌ నగర్‌ తో పాటు పలు ప్రాంతాల్లోని మురికివాడల్లో ర్యాలీ నిర్వహించి ప్రజలకు తట్టు, రూబేల్లాపై అవగాహన కలిగించారు . ఈ సందర్బంగా పెద్దిరెడ్డి ప్రదీప్‌ మాట్లాడుతూ 2014 లో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తట్టు, రూబెల్లా నిర్ములనకు ఇంటర్నేషనల్‌ లయన్స్‌ క్లబ్‌ 30 మిలియన్‌ డార్లులు విరాళంగా ప్రకటించిందన్నారు 2020 నాటికి ఈ వ్యాధుల నిర్ములానే ధ్యేయంగా లయన్స్‌ క్లబ్‌ పనిచేస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూబెల్లా తట్టు వ్యాధులను నిర్ములించే బాగంలో ప్రజలకు ఈ వ్యాధులపై అవగాహన కలిగిస్తున్నామని చెప్పారు. 9 నెల నుంచి 15 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లల అందరికి తట్టు, రూబెల్లా టీకాను తప్పనిసరిగా ఇప్పించాలని తల్లిదండ్రులకు పెద్దిరెడ్డి ప్రదీప్‌ విజ్ఞప్తి చేశారు. ఈ టీకాలను చిన్నాయి చదివే పాఠశాలో లేదా అంగన్‌ వాడి కేంద్రాలలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలో నిర్ణిత తేదీలో ఉచితంగా ఇస్తారన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రైవేట్‌ ఆసుపత్రిలో కూడా టీకాలను వేస్తారని తెలిపారు. పాఠశాలలో నిర్వహించే టీకాల కార్యక్రమంలో చిన్నారుకు టీకాలు వేసేందుకు తల్లిదండ్రుల సమ్మతి తెలపాలని సూచించారు. తట్టు రూబెల్లా టీకాలు అత్యంత సురక్షిత మైనదన్నారు. సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బంది ఈ టీకాను వేస్తారన్నారు. ఒక్కసారి మాత్రమే వాడగల సిరంజీను ఉపయోగిస్తారని చెప్పారు. మీజిల్స్‌ (తట్టు) ఒక ప్రాణంతక వ్యాధి అన్నారు. ఈ వ్యాధి కారణంగా చిన్నాయి నుమోనియా, విరేచనాలు, మెదడు వాపు వంటి వ్యాధులకు గురవుతారు అన్నారు. ఒక్కోసారి మరణానికి కూడా దారి తీయవచ్చని పెద్దిరెడ్డి ప్రదీప్‌ చెప్పారు. దగ్గడం, తుమ్మడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాది సోకుతుందన్నారు. తీవ్రమైన జ్వరం, చర్మం మీద ఎర్రని దద్దర్లు, దగ్గు, జులుబు కళ్ళు ఎర్రబడటం తట్టు వ్యాధి లక్షణాలని చెప్పారు. గఠరేతో ఉన్న మహిళలకు రూబెల్లా సోకితే పుట్టబోయే బిడ్డల కూడా ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. ఇటువంటి ప్రమాదకరమైన తట్టు, రూబెల్లాను తరిమి కొట్టేందుకు 8 నెలల నుండి 15 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లలాద్రికి తప్పనుసరిగా టేకాలు ఇప్పించాలని పెద్దిరెడ్డి ప్రదీప్‌ తల్లిదండ్రులను కోరాడు. ఎమ్మార్‌ వ్యాక్సిన్‌ జిల్లా కోఆర్డినేటర్‌గా ఏవీఎం రావు వ్యవహరిస్తున్నారని ప్రదీప్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ జోన్‌ చైర్‌ పర్సన్‌ వడ్లపూడి క ృష్ణ మోహన్‌, ఏూరు హేలపురి డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి కడియాల విజయక్ష్మి, సభ్యులు శివ నాగపోతురాజు, యూఎన్‌ వి సత్యనారాయణ, గవరవరం ఆరోగ్యకేంద్రం ఎంపిహెచ్‌ సునీత, అనంతలక్ష్మీ , జింగల్‌ బెల్స్‌ స్కూల్‌ డైరెక్టర్‌ విస్సప్రగడ సురేష్‌ ఉపాద్యాయులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *