ఒకే టీకాతో రెండు వ్యాధుల నివారణ (okay teekatho roondu vyadhula nevarana)

భాష్యంలో తట్టు`రుబేల్లా వ్యాక్సినేషన్‌
విశాఖపట్నం :

తల్లిదండ్రులు ప్రతిఒక్కరూ కూడా తమ పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించాలని కళా ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ పి.వి. రమణమూర్తి కోరారు. మంగళవారం ద్వారకానగర్‌ భాష్యం పాఠశాలలో వందలాదిమంది విద్యార్థులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథుగా కళా ఆసుపత్రి ఛైర్మన్‌ పి.వి. రమణమూర్తి, వైజాగ్‌ జర్నలిస్ట్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ముఖ్యఅతిథుగా హాజరయ్యారు. తొలుత పాఠశాల విద్యార్థులకు డాక్టర్‌ పి.వి. రమణమూర్తి టీకా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకే టీకాతో రెండు వ్యాధులను నివారించుకోవచ్చునన్నారు. జ్వరం, ఇతర వ్యాధులుంటే మాత్రం ఈ టీకాను వేయించవద్దని డాక్టర్‌ సూచించారు. వి.జె.ఎఫ్‌. అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న భాష్యం సంస్థను అభినందించారు. పేద విద్యార్థులకు తమవంతు సాయం అందించాలని, నిరుపేద జర్నలిస్టు పిల్లలకు తమ వంతు చేయూతనివ్వాని కోరారు. కార్యక్రమంలో భాష్యం జోనల్‌ ఇన్‌ఛార్జ్‌ సత్యం, ద్వారకానగర్‌ బ్రాంచ్‌ ప్రిన్సిపాల్‌ కిరణ్‌కుమార్‌, హెచ్‌.ఎం. రాధికాంబ, సతీష్‌ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *