గోల్డ్‌ మెడల్‌ సాధించిన దొండపూడి విద్యార్ధి (goldmedal sadhinchina dhodapudi vidyardhi)

గోపాలపురం:
గుంటూరు జిల్లా వడ్డమూడిలో సుప్రీంకోర్డు జడ్జి లావ నాగేశ్వరరావు చేతుల మీదుగా గోల్డ్‌ మెడల్‌ అందుకుంటున్న దొండమూడి విద్యార్ధి సఫియుల్లా గోపాపురం మండలం దొండమూడి గ్రామానికి చెందిన షేక్‌ హుస్సేన్‌, సుబాన్‌బీ దంపతుల కుమారుడు సఫియుల్లా మెకానికల్‌ ఇంజనీర్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించినట్లు సఫియుల్లాకు తర్పీదునిచ్చిన ఎస్‌కె వల్లీ మాష్టారు విలేకరులకు తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో 5వ యూనివర్సిటీ వార్షికోత్సవం జరిగింది. మెకానికల్‌ ఇంజనీర్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ను సుప్రీంకోర్టు జడ్జి లావ నాగేశ్వరరావు, డిగ్రీ సర్టిఫికేట్‌ను ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ చేతుల మీదుగా అందుకున్నట్లు సఫియుల్లా తెలిపారు. సెప్టెంబర్‌ నెలలో విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి ఇస్రో కంపెనీ యాజమాన్యం సహకరిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ప్రతి ఒక్కరూ కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సఫియుల్లా అన్నారు. తనను ఈ స్ధాయిలో నిలబెట్టిన తల్లిదండ్రులకు రాజంపాలెం పాఠశాల ఉపాధ్యాయులకు సఫియుల్లా కృతజ్జతలు తెలిపారు. గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్ధులు సఫిని అభినందించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *