జగన్‌కు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైంది

పర్యాటక శాఖా మంత్రి భూమా అఖి ప్రియ ఆరోపణ
నంద్యాల:

నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీ మీదా వైకాపా అడ్డగోలు ఆరోపణలు చేస్తోందని పర్యాటక శాఖా మంత్రి భూమా అఖి ప్రియ ఆరో పించారు. వైఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు తన అధికార బంతో వ్యవస్థను పతనం చేసిన విషయం ప్రజంలదరికీ తెలుసునని గుర్తు చేశారు. పద్మావతి నగరులోని తెదేపా కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ అధికారంలో లేకపోయినా అహంకారంతో వ్యవహరిస్తున్న వైకాపా అధినేత జగన్‌, ఆయన అనుచరులు తీరుతో ప్రజలల్లో భయందోళనులు నెలకొన్నాయని విమర్శించారు. అహంకారంతో వ్యవహరిస్తున్న వైకాపా అధికారంలోకి వస్తే తాము రోడ్ల మీద కూడా తిరగలేమన్న భయం ప్రజలల్లో ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారం ఇవ్వకూడదని నంద్యాల నియోజకవర్గ ప్రజలు నిశ్చయించుకున్నారని తెలిపారు. జగన్‌కు బుద్ధిచెప్పే సమయం ఇదే అన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి ప్రాజెక్టు కట్టకుండా మట్టి పనుల ద్వారా వైఎస్‌ రూ.వేలకోట్లు దండుకున్న వ్కెనం ప్రజంలదరికీ తెలుసని వివరించారు. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి వెనుకబడిన రాయలసీమను సస్యశ్యామం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వశక్తుల ఒడ్డుతున్నందుకు ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతున్నారన్నారు. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా క ృష్ణాడెల్టాకు అందించి, క ృష్ణా నీటిలో ఆంధ్రప్రదేశ్‌ వాటాను సీమకు తరలించాలన్న ధ ృడసంక్పంలతో పనిచేస్తున్న చంద్రబాబుకు ప్రజలల్లో ఆదరణ పెరిగిందన్నారు. వైకాపా ఓటమి భయంతో డబ్బు సంచుతో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. గత కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు నిరాశ చెందారని, ప్రస్తుత చంద్రబాబు సర్కారుతో ఉపాధి కల్పన, పరిశ్రమలు రావడం వల్ల యువత ఆనందంగా ఉన్నారన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *