పాఠశాలకు విద్యార్ధులను పంపించలేము (patasala vidyardhulanu pampalaymuu)

ఎప్పుడు కూలుతుందో తెలియని భవనం,
చేతిపంపు వద్ద దుర్గంధంతో పిల్లలు ఆనారోగ్యం పాలు
గంగోలు గ్రామస్తులు వేడుకోలు
గోపాపురం :

గోపాలపురం మండంలోని గంగోలు ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఉన్న చేతిపంపు వద్ద నీరు దుర్గంధం వెదజ్లులుతూ పిల్లలు రోగాల బారిన పడుతున్నారని అదే విధంగా శిధిలావస్ధకు చేరిన పాత భవనం ఎప్పుడూ కూలుతుందో తెలియని పరిస్ధితిలో తమ పిల్లలును పాఠశాలకు పంపలేమని పిల్లలు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 38 మంది చిన్నారులు చదువుతున్న ఈ పాఠశాలలో మంచినీరు లేదు. ఉన్న చేతిపంపు వద్ద నాచుపట్టి నీటి నిల్వ ఉండటం వల్ల దుర్గంధం వెదజ్లులుతుందని దాని ద్వారా తమపిల్లలు రోగాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. శిధిలావస్ధకు చేరిన పాత భవవాన్ని తొలగించాని ఎన్నిసార్లు వేడుకున్నా దానిని తొలగించలేదని ప్రస్తుతం భవనం ఎప్పుడు కూలిపోతుందోనని పిల్లలును పాఠశాలకు పంపేందుకు భయపడుతున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబందిత విద్యాశాఖ అధికారులుకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందుకు నిరసనగా తమ పిల్లలును పాఠశాలకు పంపేదిలేదని చేసినా తేల్చిచెబుతున్నారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి వెంటనే శిధిలావస్ధకు చేరిన భవనాన్ని తొలగించాని డిమాండ్‌ చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న చేతిపంపు చుట్టూ తుప్పు పెరిగిపోయి విషసర్పులు తిరుతున్నాయని పిల్లలుకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్ధితి ఉందని గ్రామస్తులు తెలిపారు.
మా పిల్లలను పాఠశాలకు పంపాలని ఉంది కాని అక్కడ వాతావరణం భయంకరంగా ఉండటంతో పంపించినా ఎప్పటికప్పుడు చూసుకోవాల్సి వస్తుంది. ఒక ప్రక్క శిధిలావస్ధకు చేరిన భవనం, మరోప్రక్క దుర్గంధం వెదజ్లులుతున్న మంచినీటి చేతిపంపుతో విద్యార్ధులు ఆనారోగ్యాలకు గురి అవుతున్నారు.
దీనిపై మండ విద్యాశాఖా అధికారి జి. శ్రీనివాసరావును వివరణ కోరగా శిధిలావస్ధకు చేరిన భవనాన్ని తొలగించాని జిల్లా ఆధికారులుకు తెలియజేసాం. ఉత్తర్వులు రాగానే భవనాన్ని తొలగించడం జరుగుతుంది. మంచినీటి కుళాయి విషయంపై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయమని హెచ్‌ఎంకు సూచించడం జరిగింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *