ఆ జిందగీలో ఇప్పుడు అందాల రాక్షసి

మన హీరోలు ఒక్క ఏడాదికి ఒక్క సినిమా చేస్తారు కానీ మన హీరోయిన్లు మాత్రం ఒకేసారి రెండు మూడు సినిమాలు కూడా చేస్తారు. ఇలా ఒకేసారి ఇన్ని సినిమాలు షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర షెడ్యూల్‌ చేసుకున్న డేట్స్‌ ఇబ్బంది పెడతాయి కదా. అటువంటి సందర్భాల్లో అయితే అవసరం అనుకుంటే సినిమా నిర్మాణ సంస్థ వాళ్ళు ఆగుతారు లేదా ఆ స్టార్‌ను వదిలేసి మరో స్టార్‌ని పెట్టి నిర్మిస్తారు. ఇప్పుడు కూడా అటువంటి ఒక పరిస్థితి వచ్చి ఆఖరి నిముషంలో అనుకున్న హీరోయిన్‌ కాకుండా వేరే హీరోయిన్‌తో షూటింగ్‌ మొదుపెడుతున్నారు ఒక ప్రొడక్షన్‌ సంస్థ వాళ్ళు. కిశోర్‌ తిరుమల డైరెక్ట్‌ చేస్తున్న రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో హీరోయిన్‌గా ముందు తమిళ పిల్ల మేఘా ఆకాష్‌ను తీసుకున్నారు. ఆ హీరోయిన్‌తో పాటుగా అనుపమ పరమేశ్వరన్‌ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. అయితే మేఘా ఈ సినిమా ముహూర్తంకు వచ్చింది. ఆ తరువాత నితిన్‌ సినిమా ‘లై’లో చేయడానికి ఒప్పుకుంది. ఇప్పుడు నితిన్‌తో షూటింగ్‌లో ఉండటం వలన తన అనుకున్న డేట్స్‌ ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా టీమ్‌కి ఇవ్వలేకపోయిందట. దానితో పాటుగా నితిన్‌తో మరో తెలుగు సినిమా కూడా కమిట్‌ అయ్యింది. అందుకే డేట్స్‌ సర్ధుబాటు చేసుకోలేక రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా నుండి తప్పుకోవలసి వచ్చింది. ఇప్పుడు మేఘ స్థానంలో లావణ్య త్రిపాఠి వచ్చింది. అనుపమ ఇప్పటికే తన షెడ్యూల్‌ పూర్తి చేసింది అని చెబుతున్నారు. చిత్ర యూనిట్‌. మేఘా పోర్షన్‌ మాత్రం ఇంకా మిగిలే ఉంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *