ఇష్టంతో నివేద పడుతున్న కష్టం!!

నివేదా థామస్‌ ఇప్పటికే తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైపోయింది. ఈ భామ చేసిన రెండు సినిమాలు సక్సెస్‌ కావడంతో.. దర్శక నిర్మాతలకు కూడా ఈమెపై మక్కువ పెరిగిపోయింది. జెంటిల్మన్.. నిన్నుకోరి చిత్రాలో నటించిన ఈ భామ.. త్వరలో ఎన్టీఆర్‌ మూవీ జై లవకుశతో ప్రేక్షకులను అరించేందుకు రెడీ అవుతోంది. ఇటు సినిమాల్లో ఇంత బిజీగా కనిపిస్తున్న ఈ బామ.. ప్రస్తుతం ఓ విద్యార్ధి కూడా. నటనలో కాదు.. ఈమె నిజంగానే స్టూడెంట్‌. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో బీఆర్క్‌ చదువుతున్న నివేదా థామస్‌.. క్లాసు ఎగ్గొట్టకుండానే ఇలా సినిమాలు చేస్తోందంటే నమ్మగలమా.. అయినా ఇది వాస్తవమే. నాలుగేళ్ల కోర్సులో భాగంగా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న నివేదా థామస్‌కు.. గతంలోనే సినిమా ఛాన్సు వచ్చినా.. ఈ స్టడీస్‌ కోసమే వాటిని పక్కన పెట్టింది. ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్‌ వచ్చేసిన తర్వాత కూడా స్టడీస్‌కు డిస్టర్బెన్స్‌ రాకుండా జాగ్రత్తపడుతున్న నివేద.. తన యూనివర్సిటీలో ఎక్కువ మంది తెలుగు వారే అంటోంది. అందుకే వారంతా తనతో సెల్పీ దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నా.. ఏమాత్రం అభ్యంతరపెట్టదట. అలాగని తను ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను.. కాసింత త్వరగా కాలేజ్‌కి వెళ్లిపోయి క్లాస్‌ రూంలో కూర్చుండిపోతుందట నివేదా థామస్‌.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *