ఏర్పాటు చేసిన కమిటీలను వెంటనే రద్దు చేయాలి

అసంతృప్తి తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశం
జంగారెడ్డిగూడెం:

చింతలపూడి నియోజకవర్గంలో మరో నాలుగు రోజుల్లో ఇటీవల ఎంపిక చేసిన మండల అధ్యక్షులు, కార్యదర్శుల కమిటీలను రద్దు చేయకపోతే తెదేపా పార్టీ సభ్యత్వాకు రాజీనామాలు చేస్తామని జంగారెడ్డిగూడెం పట్టణ, గ్రామీణ తెదేపా నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే పీతల సుజాత తీరుపై అసంతృప్తితో ఉన్న నాయకులు తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు మండవ లక్ష్మణరావు నివాసం వద్ద సమావేశం అయ్యారు. మండవ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు నాయకులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా ఎమ్మెల్యే మాత్రం వర్గాలు తయారు చేసి తన వర్గానికే కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గానికి పరిచయం లేని పీతల సుజాతను పార్టీ ఆదేశాను సారం మంచి మెజార్టీతో గెలిపించామని చెప్పారు. ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఆమె నియోజకవర్గాన్ని చిన్నాభిన్నం చేశారని తెలిపారు. భీమడోలులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి సామరస్యంగా సమస్యను పరిష్కారం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి తదితరులు హామీ ఇచ్చినా నేటికీ తమ మధ్య సయోధ్య కుదరలేదని వెల్లడించారు. నియోజకవర్గం నాలుగు మండలాల్లో కార్యకర్తులు, నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇది వచ్చే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *