ఘనంగా పింగళి వెంకయ్య 141 జయంతి వేడుకులు

విశాఖపట్నం :

దేశభక్తికి నిర్వచనం పింగళి వెంకయ్య అని ఉత్తరాంధ్ర శాసనమండలి సభ్యులు పివిఎన్‌ మాధవ్‌ చెప్పారు. ద్వారాకానగర్‌లోగల శ్రీ కృష్ణ విద్యామందిర్‌లో శ్రీ శారదా కళానికేతన్‌ ఆద్వర్యంలో బారత జాతీయ జెండా రూపకర్త, స్వాతంత్య్ర సమర యోధుడు పింగళి వెంకయ్య 141వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర శాసనమండలి సభ్యులు పివిఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ దేశం కోసం సర్వసం దారపోసిన మహానీయుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితాన్ని గడిపిన మహా మనిషిగా పేర్కోన్నారు. జీవితాంతం దేశం కోసం స్వాతంత్య్రం కోసం పోరాడిన వెంకయ్య ఎందరికో స్ఫూర్తిగా నిల్చారన్నారు. అటువంటి వ్యక్తి చివరి రోజుల్లో చాలా ఇబ్బందును ఎదుర్కోన్నప్పటికి ప్రభుత్వం సాయం మాత్రం ఆశించని గొప్ప వ్యక్తి అని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ గాంధీజీ ప్రోద్భలంతో పింగళి వెంకయ్య జాతీయ జెండాకు రూపకల్పన చేశారన్నారు. ప్రపంచంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న ఎవరిని చూసినా దానికి ప్రధాన కారణం వారిలో దేశభక్తి కలిగి వుండడమేనని పేర్కోన్నారు. అనంతరం వ్యాసరచన, వ్యక్తితృత్వం పోటీలో విజేతలైన విద్యార్థులకు జ్ఞాపికులు, ప్రశంసా పత్రాలను అతిధు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీశారదా కళానికేతన్‌ ఎ శ్రీనివాస్‌రావు, శంకర్‌ నీు, రమేష్‌బొప్పున, ప్రముఖ రచయిత డివి సూర్యారావు , శ్రీ కృష్ణ విద్యామందిర్‌ ప్రధానచార్యులు టి నాగేశ్వరిదేవి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గోన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *