బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలే శ్రీరామరక్ష

ఏలూరు :

తల్లిపాలే బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని ఎంఎల్‌సి, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ రాము సూర్యారావు అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి మాతా,శిశు సంరక్షణ కేంద్రం సమావేశ మందిరంలో ఏలూరు ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన రాము సూర్యారావు మాట్లాడుతూ బిడ్డకు పోతపాలను పట్టడం ఎంతమాత్రం క్షేమం కాదన్నారు. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా ఆరోగ్యం చేకూరుతుందన్నారు. గర్భిణీగా ఉన్నప్పుడు మంచి పోషక విలువ ఉన్న ఆహారం తీసుకుంటే ప్రసవం అనంతరం బిడ్డకు అవసరమైన పాలు అందుతాయన్నారు. ప్రభుత్వాసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ మాట్లాడుతూ బిడ్డ ఎదుగుదకు తల్లిపాలు దోహదం చేస్తాయన్నారు. అనంతరం బాలింతకు రోట్టెలు, పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఎం. పద్మ, వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులుసంఘం నగర అధ్యక్షురాలు ముల్లంగి శాంతకుమారి, ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ అధ్యక్షురాలు లీల, కార్యదర్శి వాసవి, సభ్యులు డాక్టర్‌ సుబ్బలక్ష్మీ, సుందరి, శారద, వాణి తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *