స్వచ్ఛ విశాఖ లక్ష్యం కావాలి

జిల్లా కలెక్టర్‌ మరియు జివియంసి ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్‌
విశాఖపట్నం:

జివియంసి పరిధిలో పారిశుధ్య నిర్వహణకు మరియు మలేరియా వ్యధి నివారణకు ఈ పరికరాలు ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్‌ మరియు జివియంసి ప్రత్యేకాధికారి ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. రూ. 3 లక్షల వ్యయంతో బ్యాక్‌ ప్యాక్‌ మిస్ట్‌ స్ప్రేయర్స్‌ 10, రూ. 2.5 లక్షల వ్యయంతో మ్యానువల్‌ స్వీపర్స్‌ 20, రూ. 7 లక్షల వ్యయంతో కార్ట్‌లెస్‌ బ్రెష్‌ కట్టర్స్‌ 8, రూ. 2 లక్షల వ్యయంతో బ్యాటరీ ఆపరేటెడ్‌ స్వీపర్స్‌ 2 కోనుగోలు చేసినట్లు తెలిపారు.ఆధునిక పరికరాలు వినియోగించడం ద్వారా మరింత స్వచ్ఛతకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కమిషనర్‌ హరినరాయణన్‌ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు గురించి జివియంసిలో చేపడుతున్న ఇతర కార్యక్రమాల గురించి వివరించారు. పర్యటనలో అదనపు కమిషనర్‌ (జనరల్‌) జివివియస్‌ మూర్తి, సి.యం.ఓ.హెచ్‌ డా. హేమంత్‌ కుమార్‌, ఏ.యం.ఓ.హెచ్‌ు, ప్రజారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *