ఎసిబికి చిక్కిన అధికారి

భీమడోలు:

నోట్లరద్దు అవినీతిని అరికడుతుంది…. జిఎస్‌టి నోట్లఖర్చు లెక్కకడుతుంది…. డబ్బులేని లావాదేమీ లంచాలను కాలరాస్తుంది అని ఎన్నిమాటలు ప్రభుత్వాలు చెప్పిన ‘తాడి తన్నెవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడ’. ఢల్లీి నుంచి గల్లీ దాకా అవినీతి, ల ంచగొండు మరకు కనిపిస్తూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే నిడమర్రు మండల ం, పెదవిండ్రకొలను గ్రామ పంచాయతీ కార్యాలయం భవన నిర్మాణ పనులు జరుగుచున్నాయి. మూడోదశ పూర్తికాగానే దానికి సంబంధించిన బిల్లు 5 లక్ష రూపాయలు విడుదయ్యాయి. వాటిని ఇప్పించవసిందిగా కాంట్రాక్టర్‌ ఆరేటి సతీష్‌ ఇంజనీరింగ్‌ అధికారులను కోరారు. ఏఇ దానికి సంబంధించిన యంబుక్‌ సిద్దం చేసి పంపగా భీమడోలు అని పంచాయతీ రాజ్‌ డిఇ ఎంఎ సలీం వద్దకు రావడంతో ఆయన 2శాతం అనగా 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు లాభం కోసం కాదు పంచాయతీ ప్రతిష్ట కోసం పనిచేస్తున్నాం అని చెప్పినా ససేమిరా అనడంతో ఈనెల 1వ తేదీన ఏసిబి అధికారులను ఆశ్రయించారని ఏసిబి డిఎస్‌పి వి గోపాలకృష్ణ తెలిపారు. అందులో భాగంగా గురువారం ఉదయం సతీష్‌ 10వేల రూపాయలు డిఇ సలీంకు ఇస్తుండగా కాపుకాసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో ఏసిబి సిఐ విల్సన్‌, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *