కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌కి ఎస్‌ఐ కావాలి

ఒక ఏ.ఎస్‌.ఐ, ఇద్దరు హెచ్‌.సిలు తక్కువే..
ఉన్న సిబ్బందిలో సగం మంది ఇతర డ్యూటీలలోనే
ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉన్నా గాలికి వదిలేసిన పోలీస్‌ అధికారులు
సిబ్బంది క్వార్టర్లు శిధిలమై దశాబ్ధాలు గడిచినా వారి కుటుంబాల గురించి పట్టించుకోని ధైన్యస్థితి
కొయ్యగూడెం :

సంవత్సరానికి సగటున దాదాపు 3 వందలు నేరాల సంఖ్యనమోదు…. గంటకు సగటున పగలు 6 వందలు, రాత్రిలు 4 వందలు వంతున భారీ వాహనాలు నడుస్తున్న 44వ నెంబరు జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్‌ సమస్య పరిస్థితులు ఉన్నప్పటికీ దాదాపు 40 రోజులుగా కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌కు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ లేరు. సాధారణ పరిస్థితులలో ఏఎస్‌ఐ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. గత మూడుదశాబ్ధాల కాలంలో ఈ పోలీస్‌స్టేషన్‌కు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ని ఇన్నిరోజులు నియమించకపోవటం ఇదే ప్రథమమని స్థానిక రాజకీయ పెద్దలు అంటున్నారు. ఎస్‌.ఎస్‌.ఎస్‌ పవన్‌కుమార్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఇక్కడ 40 రోజుల క్రితం వరకు ఇక్కడ పనిచేసారు. ఆయన ఇక్కడ పనిచేసింది కొద్దినెలలే అయినప్పటికీ నీతి, నిజాయితీపరుడుడైన పోలీసు అధికారిగా, స్టేషన్‌కు వివిధ సమస్యలపై వచ్చే ప్రజల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించి ఆయన పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలలో సదభిప్రాయాన్ని కలిగించటానికి కృషి చేసారు. అంతేకాకుండా పోలీస్‌స్టేషన్‌లోను, స్టేషణ్‌ ఆవరణలోను, చుట్టుపక్క పోలీసు తెరచాటు మద్దతుతో జరిగే దళారీ అడ్డా వ్యవస్థను, అలాంటి పరిస్థితులను నిర్దాక్షిణ్యంగా ఆయన అణచివేసి ప్రజలలో మంచి ఆదరను, గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఆయన నిజాయితీ తనం, దళారుల అడ్డాను అణచివేయటంతో ఆదాయానికి గండిపడిన కొందరు నిందితులతో చేతులు కలిపి గత జూన్‌ 11వ తేదీ రాత్రి పోలీస్‌స్టేషన్‌పై ఎసిబి అధికారుల దాడికి బాట వేశారు. గత మూడున్నర దశాబ్ధా కాంలోనే కాదు, ఇక్కడి పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటైన దాదాపు వంద సంవత్సరాల చరిత్రలో ఈ స్టేషన్‌పైన ఎసిబి అధికారులు దాడి జరపటం ఇదే ప్రధమం. గురి ఎస్‌ఐ పవన్‌కుమార్‌పైనే అయినా నిందితుడు ప్రత్యక్షంగా పట్టుబడటంతో ఎస్‌ఐకి గండం తప్పింది. ఎసిబి అధికారులు స్టేషన్‌పై దాడి చేసిన రాత్రి మండలంలోని అన్నిగ్రామాల నుంచి అన్నివర్గాల ప్రజలు ముఖ్యంగా యువత దాదాపు 4 వందల మంది వరకు స్టేషన్‌కు వచ్చి తెల్లవార్లు అక్కడే ఉన్నారు. ఎస్‌ఐ పవన్‌కుమార్‌ నిజాయితీపరుడని, ఆయనపై కేసునమోదు చేసినా, అరెస్టుచేసి తీసుకువెళ్లటానికి ప్రయత్నించినా అడ్డుకుంటామని ఎసిబి అధికారులును ప్రజలు హెచ్చరించారు. పాత్రికేయులు కూడా ఎస్‌ఐ నిజాయతీ గురించి ఎసిబి అధికారులుకు వివరించి చెప్పారు. ఎసిబి ఆయనను అరెస్టు చేయలేదు. తీసుకువెళ్లనూలేదు. అయితే పాలనాపరమైన నిబంధనలతో పవన్‌కుమార్‌ను ఇక్కడి నుంచి బదిలీ చేసారు. కానీ ఆయన బదిలీ జరిగి 40 రోజులు కావస్తున్నా…ఉన్నతాధికారులు ఇక్కడ ఎస్‌ఐగా ఎవరినీ నియమించకపోవటం చర్చనీయాంశమయింది. సాధారణ బదిలీలో ఎవరినైనా నియమిస్తారని భావించారు. అవి కూడా జరిగిపోయాయి. కానీ ఇక్కడకు ఎస్‌ఐగా ఎవరినీ నియమించలేదు. ఈ స్టేషన్‌లో ఎస్‌ఐతో పాటు, ఏఎస్‌ఐ పోస్టు 2, హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టు 4, కానిస్టేబుల్‌ పోస్టు 21 ఉన్నాయి. ఎస్‌ఐ పోస్టు ఖాళీ.. రెండు ఏఎస్‌ఐ పోస్టులలో ఒకటి ఖాళీగా ఉంది. 4 గురు హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులలో 2 పోస్టులు ఖాళీ 21 మంది పిసి పోస్టులలో 2 కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 19 మంది కానిస్టేబుల్‌లలో దాదాపు సగం మంది నిత్యం ఇతర డ్యూటీలపై వెళతారు. ఏ క్రైమ్‌ వచ్చినా, యాక్సిడెంట్‌ అయినా మిగిలిన సగం మందిపైనే పనిభారం పడుతోంది. నెలకు సగటున 25 కేసులు వంతున యేడాదిలో 3 వందల వరకు క్రైమ్‌రేటు ఇక్కడ నమోదవుతున్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌, ముంబయి, నాగ్‌పూర్‌ ప్రాంతాల నుంచి అధికలోడు విశాఖ, కాకినాడ పోర్టుకు కోల్‌కత్తాకు వెళ్లే భారీ వాహనాలు, బస్సు, ఇతర వాహనాల సంఖ్య సగటున పగలు గంటకు 6 వందలపైనే ఉంటాయి. ఆసంఖ్య 4 వందల వరకు ఉంటుంది. ఈ వాహనాలన్నీ కొయ్యలగూడెం మీదుగా ఉన్న 44వ నెంబరు జాతీయ రహదారిపైనే ప్రయాణించి కొవ్వూరు వద్ద గోదావరి రహదారి వంతెనపై నుంచి 16వ నెంబరు జాతీయ రహదారి మీదికి వెళతాయి. ఇంతటి భారీ ట్రాఫిక్‌ సమస్య ఇక్కడ ఉన్నప్పటికి కొయ్యలగూడెంలో ట్రాఫిక్‌ ఒత్తిడిని, అదుపు చేసి ప్రజలకు ఇబ్బందు తొలగించేందుకు పోలీసు ఉన్నతాధికారులు శ్రద్ద ఆసక్తి చూపటం లేదనే విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. చెక్‌పోస్టు కూడలిలోనూ గాంధీబొమ్మ సెంటర్‌లోను ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ఆరెండు చోట్ల నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలన్న ప్రజాభిప్రాయానికి అధికారులు కిమ్మనటం లేదంటున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *