జిఎస్‌టితో ప్రజలపై అధిక భారం

జంగారెడ్డిగూడెం:

జీఎస్‌టి బిల్లు ప్రజలపై అధిక భారాలు వేయటమేనని ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ అన్నారు. జీఎస్‌టీ బిల్లుకు వ్యతి రేకంగా అగస్టు మొదటి వారం నిర్శన ప్రదర్శన సభలు జరపాలని ఐఎఫ్‌టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం బోసుబోమ్మ సెంటరులో గంప శ్రీను అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో కెవి రమణ మాట్లాడుతూ జీఎస్‌టీ బిల్లుకు వలన దేశంలో అన్ని వర్గాల ప్రజలను పన్నుల పరిధిలోకి తీసుకొచ్చి గతం కంటే అధికంగా పన్నులు వేయ్యటమేనని విమర్శిం చారు. ఈ విధనాల వలన చిన్న తరహ పరిశ్రము వ్యాపారాలు దివాళ తీసి కార్పోరేట్‌ సంస్ధలు దోచుకోవాటానికి గేట్లు బార్లా తీయ్యటమేనని అన్నారు. దేశంలో వ్యాపారస్తులు ప్రజలు వ్యతిరేకిస్తున్నా బిజెపి ప్రభుత్వం బిల్లు తీసుకొని రావ టం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ బిల్లు వలన కొన్ని రాష్ట్రలలో ప్రజ అవసరాల దృష్ట్య కొన్ని వస్తువుల రేట్లు తగ్గించుకోనే అవకాశం ఉండేదని ఇప్పుడు ఏ రాష్ట్రకి ఆ అవకాశం లేదని విమర్శించారు. సిపిఐఎంసి న్యూడెమోక్రసి పట్టణ కార్యదర్శులు ఏసుబాబు మాట్లాడుతూ జీఎస్‌టీ బిల్లు ద్వారా రైతు ఉత్పత్తి చేసే అహార ధన్యాలకు కూరగాయలకు పన్ను మినహా ఇంచామని చెప్పుతునే ఆ అహార పంట ఉత్పత్తికి అవసరమయ్యే ఎరువులు పురుగు మందులు వ్యవసాయ పని ముట్లకు బారిగా పన్ను విధించారని ఆ విధంగా రైతుపై భారం మోపి అసత్యప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలకి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజానికం ఉద్యమించాలని అన్నారు. ఈ సభలో పిడిఎస్‌ వి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ భూషణం ఎఐకెఎంఎస్‌ జిల్లా కమిటీ సభ్యులు ఎ ధర్మారావు గంప వెంకటేష్‌ మాట్లాడారు. అంతకు ముందు మసీదు సెంటర్‌ నుండి ప్రదర్శన భగత్‌సింగ్‌ సెంటర్‌ బుట్టాయిగూడెం రోడ్డులో నిర్వహిం చటమైనది ఈ కార్యక్రమానికి కొల్లి రాంబాబు, ఎం రాజు, ముప్పిడి రాంబాబు, సురేంద్రకుమార్‌, నాయకత్వం వహించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *