బిడ్డకు తల్లిపాలు శ్రేష్టమైనవి

ఏలూరు హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు పెద్దిరెడ్డి ప్రదీప్‌
ఏలూరు:

బిడ్డకు తల్లిపాలు శ్రేష్టమైనవని ఏలూరు హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు పెద్దిరెడ్డి ప్రదీప్‌ అన్నారు. తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా గురువారం శనివారపుపేట పంచాయతీ శ్రీరామ్‌నగర్‌లోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో పెద్దిరెడ్డి ప్రదీప్‌ ఆధ్వర్యంలో బాలింతలకు మదర్‌హార్లిక్స్‌, పాలు, పౌష్టికాహారాన్ని ఉచితంగా అందజేసారు. అలాగే గవరవరంలోని విభిన్న ప్రతిభావంతులు భవిత్‌ కేంద్రంలోని వారందరికీ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన ప్రదీప్‌ మాట్లాడుతూ బిడ్డపుట్టిన మరుక్షణం నుంచి తల్లిపాలు ఇవ్వాలన్నారు. తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఎదుగుదల ఉంటుందని చెప్పారు. అలాగే బిడ్డల్లో ఆలోచనాశక్తి పెరుగుతుందని, విజ్ఞానవంతులుగా తయారు అవుతారన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన తల్లిపాలను కొంతమంది తల్లులు వారి బిడ్డకు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. తల్లిపాల విశిష్టతను హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌క్లబ్‌ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుందని చెప్పారు. బిడ్డకు తల్లిపాలు ఇవ్వాని ఆయన సూచించారు. బిడ్డలు ఆరోగ్యంగా ఉండాంటే తల్లులు తప్పనిసరిగా పాలు ఇవ్వాలన్నారు. కొంతమంది తల్లులు బిడ్డపుట్టిన మూడునెల నుంచి పాలు ఇవ్వడం మానివేస్తున్నారని ఈ కారణంగా బిడ్డలు ఆరోగ్యంగా ఎదగడం లేదని చెప్పారు. తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా తల్లిపాల విశిష్టతను ప్రచారం చేయడమే కాకుండా బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని ఏలూరు హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి కడియా విజయక్ష్మీ, జోనల్‌ ఛైర్‌పర్సన్‌ వడ్లపూడి కృష్ణమోహన్‌, పాస్ట్‌ ప్రెసిడెంట్‌ శివనాగపోతురాజు, సభ్యు యుఎన్‌వి సత్యనారాయణ, ఉప ఎంపిపి లంకపల్లి మాణిక్యారావు, ఎంపిటిసి రామ్మోహనరావు, స్కూల్‌ టీచర్‌ బి రేఖ కెజియా తదితయి పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *