భీమోలు భూములు పేదలకు కేటాయించాలి

గోపాలపురం:

మండలంలోని భీమోలు మిగులు భూములు పేదలకు పంచాలని లేకపోతే ఆందోళనకు దిగుతామని గురువారం భీమోలు గ్రామస్తులు సీపీఐ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట కూర్చుని నిరసన వ్యక్తం చేసారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ భీమోలు గ్రామానికి చెందిన మారెడ్డి జగ్గారావు కుమారుడు బుచ్చిరాజుకు చెందిన సుమా రు 385 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం సీలింగ్‌లో ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. అప్పట్లో ఆ భూమిని ప్రభుత్వం నిరుపేదలు 149 మందికి పట్టాలు మంజూరు చేసియుందన్నారు. మూడు సంవ త్సరాలు పన్నులు కట్టారు. కానీ ఇటీవల కొందరు స్వార్ధపరులు ఆ భూమిపై కన్నేసి ఎలాగైనా పేదల నుండి భూములను లాక్కోవాలని చూస్తున్నారన్నారు. గత 10 ఏళ్ళగా ఈ భూమి వివాదం కోర్టులో జరుగుతుందన్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూములకు కొందరు బినామీ వ్యక్తులు పట్టాదారులు, కౌలుదారులు కాని వారు ఆ భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని ఫిర్యా దు చేసారు. గత సంవత్సరం రెవిన్యూ పోలీసులు కలిసి ఇరువర్గాలు ఎవ్వరూ భూముల్లోకి వెళ్ల వద్దని తెలిపారు. కానీ ఏడాది కౌలుదారులు అంటూ చెప్పుకొనే కొం దరు వ్యక్తులు భూము సాగు చేస్తున్నారని వెంటనే వారిని కూడా భూముల్లోకి వెళ్లకుండా నిలుపుదల చేసి కోర్టు తీర్పు ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోరారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి భూములు ఇవ్వాలని డిమాండ్‌ చేసారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *