ముద్రగడ పాదయాత్రకు మళ్లీ అడ్డంకి

కిర్లంపూడి:

ఛలో అమరావతి పేరుతో నిరవధిక పాదయాత్రను చేపట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పోలీసులు గురువారం మళ్లీ అడ్డుకున్నారు. ఉదయం తొమ్మిది గంట ప్రాంతంలో ముద్రగడ తన అనుచరులతో కలిసి ఇంటి ఆవరణలో ఉన్న గేటు వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలనుకుంటన్న పాదయాత్రకు ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారో చెప్పాలని ఆయన పోలీస్‌ అధికారులను డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం నుంచి పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని.. కానీ మీరు అనుమతి తీసుకోని కారణంగానే అనుమతి ఇవ్వట్లేదని పోలీసులు ముద్రగడకు తెలిపారు. దీంతో ముద్రగడ పోలీసులతో మాట్లాడుతూ.. 2014లో చంద్రబాబు పాదయాత్రకు ఏ విధమైన దరఖాస్తు చేశారో, ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందో చెబితే తాను కూడా అనుమతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్‌ చేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *