విలువైన భూములు దానం ఇవ్వడం అభినందనీయం

వ్యవసాయ శాఖ కార్యాయాలన్ని ప్రారంభించిన ఎంఎల్‌ఏ ముప్పిడి
గోపాలపురం:

ప్రభుత్వ కార్యాయాలకు విలువైన భూములను ఇవ్వడం ద్వారానే దాత యొక్క దాతృత్వం కనిపిస్తుందని ఎంఎల్‌ఏ ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. స్ధానిక రొంగల వారి వీధిలో రూ. 10 లక్ష వ్యయంతో నిర్మించిన మండల వ్యవసాయ శాఖ నూతన భవనాన్ని గురువారం ఎంఎల్‌ఏ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబంలో జన్మించి వ్యవశాయమే ప్రధాన వృత్తిగా చేపట్టి తమ విలువైన సుమారు 20 సెంట్లల భూమిని ప్రభుత్వ కార్యాయాలకు దానం చేయడం హర్షనీయమని దాతలు కర్లపూడి సత్యనారాయణను ఆయన అభినందించారు. వ్యవసాయశాఖ కార్యాయమే కాకుండా పశువుల ఆసుపత్రికి కీర్తశేషులు కర్లపూడి సత్యనారాయణ, తండ్రి సూరన్న పేరుపై స్ధలాలు కేటాయించిడం వారి దాతృత్వానికి నిదర్శనమన్నారు. జడ్‌పీటీసీ సభ్యురాలు ఈలి మోహిని పద్మజారాణి, ఉపసర్పంచ్‌ శరత్‌బాబును అభినందించారు. అనంతరం స్ధానిక ఎంపీడీఓ కార్యాయల ఆవరణలో రూ. కోటి విలువైన నూతన ఎంపీడీఓ భవనాల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసారు. ఏఎంసీ చైర్మన్‌ ముళ్లపూడి వెంకట్రావు, ఎంపీపీ గద్దే అరుణ వెంకటేశ్వరరావు, ఏడీఈ ఎస్‌జేవి రామ్మోహన్‌రావు, ఏఓ సి పవన్‌కుమార్‌, ఎంపీడీఓ కె. కృష్ణప్రసాద్‌, ఎంపీటీసీ సభ్యులు తానేటి శ్యామల, కూనపోం ప్రసాద్‌బాబు, తొర్లపాటి జ్యోతి, ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్‌ జేష్ఠ శ్రీనివాసరావు, కొర్లపాటి రాము వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *