శ్రీశ్రీ పబ్లిక్‌ స్కూల్‌లో వరలక్ష్మీ వ్రతం వేడుకులు

ఏలూరు:

ప్రతీ తెలుగింటి ఆడపడుచు సాంప్రదాయబద్దంగా నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని ‘‘ శ్రీశ్రీ ’’ విద్యాసంస్ధలో ఘనంగా నిర్వహించారు. కోరిన వరాన్ని ప్రసాదించే వరలక్ష్మీతో పాటు అష్టలక్ష్ములైన ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, విద్యాలక్ష్మీ, విజయలక్ష్మీ, ధైర్యలక్ష్మీ, ఆదిలక్ష్మీ, గజలక్ష్మీ, సంతానలక్ష్మిు కూడా విచ్చేసి శ్రీశ్రీ పాఠశాల నందు కొలువుదీరి ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు దర్శనభాగ్యం కలిగించి, వారికి దీవెనందించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ విద్యాసంస్ధల అధినేత యం.బి.యస్‌ శర్మ మాట్లాడుతూ కన్నుతెరిస్తే సృష్టి, కన్ను మూస్తే లయ ఆరెంటికి మధ్యన ఉన్నదే స్థితి. ఈ స్ధితిలయల కారణభూతంగా హైదవులందరూ నమ్మే నమ్మకమే పూజ. అష్టలక్ష్ము శక్తి లేని ప్రపంచం లేదని ఈ శక్తులకు ఆది దేవత, అష్టశక్తులకు నిలయం లక్ష్మీదేవి అందుకే ఆమెను పూజించి కటాక్షం పొందాని బాల్యం నుండే ఇటువంటి విషయాల పట్ల పిల్లలకు అవగాహన కల్పించటానికి పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. వీటి ద్వారా బాల బాలికలకు మన సంసృతీ, సంప్రాదాయం పూజావిధనం అవడతాయి. సర్వమత సామరస్యం సాధ్యపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ విద్యాసంస్ధల అధినేత యం.బి.యస్‌ శర్మ మరియు అడ్మినిస్ట్రేటివ్‌ ఇన్‌చార్జ్‌ బి.పద్మావతి, ఎవిఎన్‌ మాధురి, అరుణ మరియు తదితరులు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *