కృష్ణవంశీతో నటించాలనే పైసా తీసుకోలేదట తేజు

నక్షత్రం సినిమాలో స్పెషల్‌ రోల్‌ చేశాడు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌. ఈ సినిమాలో అలెగ్జాండర్‌ అనే పోలీసాఫీసర్‌ క్యారెక్టర్‌ పోషించాడు. సినిమాలో 30 నిమిషాలకు పైగా ఉంటుందీ పాత్ర. అంటే దీన్ని గెస్ట్‌ రోల్‌ అనకూడదు. ప్రత్యేక పాత్ర అనాలి. సినిమాలో కీలకమైన ఇంత పెద్ద పాత్ర పోషించి కూడా పైసా తీసుకోలేదట తేజు. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణవంశీ వెల్లడించారు. ‘‘నిజానికి అలెగ్జాండర్‌ పాత్ర కోసం సంజయ్‌ దత్‌ను అనుకున్నాం. సంజయ్‌ నాకు పదేళ్లుగా పరిచయం. ఈ మధ్య కలిసినప్పుడు దాదాపు 2 గంటల మాట్లాడుకున్నాం. అప్పుడే అలెగ్జాండర్‌ పాత్ర కోసం ఆయనను ఊహించుకున్నాను. కానీ సంజయ్‌ కంటే ఓ ఎనర్జిటిక్‌ కుర్రాడ్ని పెడితే పాత్ర ఇంకా బాగా పండుతుందని భావించి తేజూను తీసుకున్నాం. తన దర్శకత్వంలో నటించాలనే కోరికతో ఉన్న సాయిధరమ్‌ తేజ నక్షత్రం కోసం పారితోషికం తీసుకోలేదు’’ అని అన్నాడు కృష్ణవంశీ. నక్షత్రం సినిమా బడ్జెట్‌ ఇప్పటికే హద్దు దాటిపోయింది. సందీప్‌ కిషన్‌ మార్కెట్‌ వాల్యూను మించి ఖర్చుచేశారు. పైగా ఆఖరి నిమిషంలో శ్రియతో ఐటెంసాంగ్‌ కూడా పెట్టి, ఆమెకు బాగానే ముట్టజెప్పారు. సాయిధరమ్‌ తేజ్‌తో ఫ్రీగా చేయించుకున్న మేకర్స్‌.. సందీప్‌, తనీష్‌, శివాజీ రాజా, ప్రగ్యాజైశ్వాల్‌ లాంటి వాళ్లకు మార్కెట్‌ రేటు కంటే చాలా తక్కువ రెమ్యునరేషన్‌ ఇచ్చారు. వాళ్లకు కూడా ఫుల్‌ పేమెంట్స్‌ ఇస్తే నక్షత్రం సినిమా నిర్మాతలకు నిజంగానే నక్షత్రాలు కనిపించేయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *