జగన్‌ దిష్ఠిబొమ్మ దగ్ధం

కొయ్యలగూడెం :

నంద్యాల సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేసిన విమర్శులు, అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన తొపుతూ కొయ్యలగూడెం గాంధీ బొమ్మ కూడలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, స్ధానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తులు శుక్రవారం నాడు భారీ ఎత్తున నిరసన తెలిపారు. తెలుగుదేశం పార్టీ జెండాలు చేతపట్టి ప్రదర్శనగా ప్రధాన రహదారిపై గాంధీ బొమ్మ సెంటర్‌ వరకు వచ్చి అక్కడ జగన్‌ దిష్ఠిబొమ్మను తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిప్పటించి దహనం చేశారు. ముఖ్యమంత్రిని నడిబజార్‌లో కాల్చలి అంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యల పట్ల పోలవరం ఎఎంసి ఛైర్మన్‌ పి రామారావు, జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్‌ పర్సన్‌ చింతా వెంకటరమణ, ఎపి ఉమెన్స్‌ సహకార ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జి మేఘాలదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *