పోలవరం బ్రిడ్జిపై మట్టి తొలగింపు

గోపాలపురం: మండలంలోని పెద్దాపురం వద్ద ఉన్న పోలవరం కుడి ప్రధాన కాలవ బ్రిడ్జికి రెండు వైపులా ఉన్న మట్టిని స్ధానిక వైఎస్‌ఆర్‌ సీపీ నాయకుడు చల్లమళ్ల రవెంకటసత్యనారాయణ తన సొంత ఖర్చుతో శుక్రవారం తొలగించారు. బ్రిడ్జికి ఇరువైపులా మట్టి పేరుకుపోవడం వల్ల వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వాధికారులుకు, కాలువ నిర్వాహకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పోలవరం కాలువ బ్రిడ్జి, తాడిపూడి కాలువ బ్రిడ్జిలో ఉన్న మట్టిని ఆయన తొలగించారు. సుమారు రూ.5 వేల ఖర్చుతో పనులు చేసినట్లు చెప్పారు. అదే విధంగా మిగిలిన గ్రామాలలో కూడా నాయకులు స్వచ్ఛందంగా కాలువ బ్రిడ్జిపై ఉన్న మట్టిని తొలగించాని ఆయన కోరారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *