మండల కాపు కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా త్రిమూర్తులు

గోపాలపురం : మండలంలోని కరిచర్లగూడెం గ్రామానికి చెందిన అనిశెట్టి త్రిమూర్తులును మండల కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌గా నియమించినట్లు ఎంఎల్‌ఏ ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రకటించారు. త్రిమూర్తులుకు స్ధానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఎంఎల్‌ఏ మాట్లాడుతూ కాపుకు నియోజకవర్గంలో కేటాయించిన రుణాలను సకాలంలో అందచేయడం జరుగుతుందన్నారు. కాపులకు తగినంత ప్రాధ్యన్యత ఇవ్వాలన్న ధ్యేయంతోనే ప్రభుత్వం అన్ని విధాలుగా కాపులను ఆదుకుంటుందన్నారు. కాపు కార్పోరే షన్‌ చైర్మన్‌గా ఎంపికైన త్రిమూర్తులు మాట్లాడుతూ మండలంలోని కాపుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానన్నారు. కాపులకు ప్రభుత్వం కల్పించిన రుణాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి ముప్పిడి అశోక్‌ కుమార్‌, కాపు నాయకులు వడ్లపూడి సత్యనారాయణ, కోలా శ్రీను, వేము నాగరాజు, ప్రసాద్‌ పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *