తల్లిపాలతోనే బిడ్డకు శ్రీరామరక్ష

కొయ్యలగూడెం : బిడ్డకు జన్మనిచ్చిన ప్రతీ తల్లి తమ బిడ్డలకు తల్లిపాలు ఇవ్వటం బాధ్యతగా భావించాలని ఎంపిపి అయినపర్తి చందనశ్రీదేవి పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా కొయ్యలగూడెం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారులు, ఉద్యోగినులు శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెమినార్‌ హాలులో నిర్వహించిన సమావేశంలో ఎంపిపి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. తల్లిపాలతోనే బిడ్డకు వ్యాధి నిరోధకశక్తి పెరిగి మంచి ఆరోగ్యవంతులుగా పెరుగుతారని ఆమె అన్నారు. మరో ముఖ్యఅతిధి ఆంధ్రప్రదేశ్‌ మహిళా సహకార ఆర్దిక సంస్థ డైరెక్టర్‌ గంగిరెడ్ల మేఘలాదేవి మాట్లాడుతూ కన్నబిడ్డకు తల్లిపాలు ఇవ్వటం గర్వంగా భావించాలని తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆహారం లభించి శ్రీరామరక్ష అవుతుందని అన్నారు. తల్లికి పాలు ఉండాంటే గర్భిణీగా ఉన్నప్పుడు ప్రసవం తర్వాత బాలింతగా ఉన్నప్పుడు స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె అన్నారు. జడ్‌పి వైస్‌ఛైర్‌ పర్సన్‌ చింత వెంకటరమణ మాట్లాడుతూ బిడ్డకు తల్లిపాలుకు మించిన పౌష్టికాహారం మరొకటి లేదని అందువల్ల బాలింతలు బేషజాలకు పోకుండా తమ బిడ్డలకు పాలు ఇవ్వాలని హితవు పలికారు. స్థానిక పరింపూడి సర్పంచ్‌ గంజిమాదేవి మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను పుట్టిన బిడ్డకు తల్లులు పాలు ఇవ్వవలసిన ఆవశ్యకతను అంగన్‌వాడీ ఉద్యోగులు గర్భిణీ దశ నుంచే మహిళలకు వివరించి చెప్పాలని అన్నారు. ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారిణి అమరావతి మాట్లాడుతూ బిడ్డలకు తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కలిగించటానికి ప్రభుత్వం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించి ప్రచారం చేస్తోందని అన్నారు. అంగన్‌వాడీ సెక్టార్‌ సూపర్‌వైజరలు బ్యూలా, కృష్ణవేణిలు కూడా ప్రసంగించారు. అనంతరం అంగన్‌వాడీ ఉద్యోగులు, అధికారులు, బిడ్డ తల్లలుతో కలిసి ముఖ్య అతిధులు తల్లిపాల వారోత్సవ ప్రదర్శన నిర్వహించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *