రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి

ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ జేష్ట
గోపాపురం : ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని తద్వారా ఆసుపత్రికి మంచి గుర్తింపును తీసుకురావాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ జేష్ట శ్రీనివాసరావు అన్నారు. స్థానిక పిహెచ్‌ వద్ద శనివారం వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఛైర్మన్‌ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల దురుసుగా వ్యవహరించడం వల్ల ప్రజల్లోకి ఆసుపత్రిపై చెడు అభిప్రాయం వెళుతుందన్నారు. అందువల్ల వైద్యులు, సిబ్బంది తగుజాగ్రత్తులు తీసుకోవాలన్నారు.
త్వరలో వైద్యుల భర్తీ : పిహెచ్‌సిలో అవసరమైన మందు ఉన్నా సరిపడా వైద్యులు లేకపోవడంతో సిబ్బందికి ఒత్తిడి ఎక్కవగా ఉందన్నారు. అందువల్ల త్వరలో పూర్తిస్థాయిలో వైద్యులను నియమించడానికి జిల్లా అధికారులకు నివేదికలు పంపినట్లు చెప్పారు. ముగ్గురు వైద్యులకు ఒక హెడ్‌నర్సు పోస్టు ఖాళీలు పూరించడం జరుగుతుందన్నారు. ఒక కోటి 25 లక్షతో నూతన భవనానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. త్వరలో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆసుపత్రి కమిటీ సభ్యులు బూరెడ్డి బంగారయ్య, డాక్టర్లు ఎం శోభారాణి, పి చైతన్య సిబ్బంది పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *