శ్రీశ్రీలో రాజకీయ ప్రత్యర్ధులు స్నేహితులైన వేళ

ఏలూరు : మానవాళి మనుగడను, ఉల్లాస పరిచేందుకు పండుగల లాంటి దినోత్సవాలను మనిషి ఏర్పరచుకున్నాడు. తల్లిదండ్రుల దినోత్సవం, మానవహక్కుల దినోత్సవం..వగైరా..వగైరా ఆగస్టు నెలలో మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం. నీ స్నేహితుని గురించి చెప్పు, నీ గురించి నేను చెబుతాను. మన కష్టాలు మన నిజమైన స్నేహితులు ఎవరో చెపుతాయి. స్నేహబంధం ఎంతో మధురమైనది. మానవ జీవన వికాసంలో సేదదీరే చెట్ల నీడలాంటి వారు స్నేహితులు, ఇట్లా స్నేహితుల గురించి ఎన్నో ఉవాచలు, వ్యాఖ్యానాలు చోటు చేసుకుంటాయి. ధనిక, పేద, పురుష, స్త్రీలింగ బేధాలు, రాజు, బంటు వంటి బేధాలు లేకుండా స్నేహితులు ఉన్నతులైనారని అనేక చారిత్రక కధలు, పురాణ గాధలు మనం వింటూ వుంటాము. మరి నేడు స్నేహితుల దినోత్సవం నాడు పరస్పర రాజకీయ బద్ద శుత్రువులైన ప్రత్యర్ధి నాయకులు నిష్క్మషంగా స్నేహితులై ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్లు కట్టుకుంటే ఆ దృశ్యం అపురూపం, ఇలాంటి దృశ్యాన్ని ఏలూరులోని శ్రీశ్రీ పబ్లిక్‌ స్కూలు, విద్యార్ధినీ, విద్యార్ధులు, నాయకులై పోషించారు. నరేంద్రమోడీ ` సోనియాగాంధీ, చంద్రబాబు`జగన్‌, తెలంగాణలో కెసిఆర్‌`రేవంత్‌రెడ్డి, వెంకయ్యనాయుడు ` గోపాలకృష్ణ గాంధీ, అమిత్‌షా`రాహుల్‌గాంధీ, బీహర్‌ సిఎం నితీష్‌కుమార్‌ ` లాలుప్రసాద్‌ యాదవ్‌ ఒకరికొకరు ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు కట్టుకుని ఆలింగనం చేసుకున్నారు. రాజకీయ కురుక్షేత్రంలో రగిలిపోతున్న మన నేతలు స్నేహితులైతే ఎలా ఉంటుంది. రాజకీయ నేపధ్యాలు ఎలా వున్నాయో చిన్నారుకు తెలియజెప్పానే లక్ష్యంతో స్కూల్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శ్రీశ్రీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధినేత యమ్‌బియస్‌ శర్మ తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్‌ ఇన్‌చార్జిలు బి పద్మావతి, ఎవిఎస్‌ మాధురి కలిసి విద్యార్ధులచే ఈ సరదా కార్యక్రమాన్ని నిర్వహింపజేసారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *