10న విద్యాసంస్థల బంద్‌ : పిడియస్‌యూ

ఏలూరు : రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా గతంలో జీవోనెం 14 తీసుకువచ్చి ప్రభుత్వ మునిసిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దుచేయాలని భావించినప్పుడు పిడియస్‌యూ, ఇతర విద్యార్ధి, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల ఫలితంగా ప్రభుత్వం అధికారికంగా జీవో నెం. 14ను రద్దు చేసింది. కాని పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభమైన తరువాత ప్రభుత్వం మరొకసారి అనధికారికంగా ప్రధానోపాధ్యాయులు మరియు ఇన్‌ఛార్జిలకు ఆదేశాలు ఇచ్చి మీ యొక్క పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీషు మీడియం కొనసాగించమని ఆదేశాులు ఇచ్చింది. విద్యార్ధు యొక్క జీవితాన్ని అంధకారం చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీని వలన విద్యార్ధులు డ్రాపవుట్స్‌ పెరిగే అవకాశం ఉంది. మరియు పాస్‌ పర్సంటేజ్‌ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కావున ప్రభుత్వ మున్సిపల్‌ పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టడాని నిరసిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మరియు కళాశాలల్లో నెలకొని వున్న సమస్యలు పరిష్కరించడం రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడాన్ని నిరసిస్తూ ఆగస్టు 10న విద్యాసంస్థ బంద్‌కు పిడియస్‌యు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *