కధల పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎంఎల్‌సి రాము సూర్యారావు

ఏలూరు : స్థానిక ది ఇండో ఇంగ్లీషు స్కూల్‌ నందు సోమవారం ఉదయం 9 నుండి స్కూలు ఆవరణలో విధ్యార్దులందరిచే రక్షాబంధన కార్యక్రమం నిర్వర్తించినారు. దీనిలో భాగంగా ది ఇండో-ఇంగ్లీషు స్కూల్‌ మరియు భారతీయ సంస్క ృతి వారసత్వ పరిరక్షణ సమితి ఏలూరు వారు సంయుక్తంగా నిర్వర్తించిన కార్యక్రమంలో స్కూల్‌ చైర్మన్‌ డా’’ ఏ.వి.ఎన్‌.రాజు రచించిన కథలు అనే పుస్తకాన్ని వెత్సా పాండురంగారావు జాహ్నవి హేలాపురి కథాయాం పేరు మీద హిందీలోనికి తర్జుమా చేసిన పుస్తకాన్ని దీనభందు, వైద్య నారాయణ, అజాత శతృ కీ.శే. డా.చెన్నకేశవు రంగారావు జన్మ దినాన్ని పురస్కరించుకొని వారికి అంకితమిస్తూ మన ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ శాశన మండలి సభ్యులు రాము సూర్యారావు చేతుల మీద ఆవిష్కరింప చేసారు. ఈ కార్యక్రమానికి స్కూల్‌ ప్రిన్సిపాల్‌ డా.ఇ.బి.వి.ప్రసాద్‌ అధ్యక్షత వహించగా ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు రాము సూర్యారావు ముఖ్య అతిధిగా విచ్చేసారు. వెత్సా పాండురంగారావు, ఝాన్సీ రంగారావు విశిష్ట అతిధులుగా విచ్చేయగా స్కూల్‌ చైర్మన్‌ డా.ఏ.వి.ఎన్‌.రాజు సెక్రటరీ కరస్పాండంట్‌ సుభద్ర రాజు గౌరవ అతిధుగా విచ్చేసారు. శ్రీరామ చంద్రమూర్తి భారతీయ సంస్కృతి వారసత్వ పరిరక్షణ సమితి ఏలూరు, సెక్రటరీ ప్రత్యేక అతిధిగా విచ్చేయగా విద్యార్దినిలు అతిధుకు పుష్ప గుచ్ఛములిచ్చి స్వాగతం తెలియ చేసారు. విధ్యార్దినిలు మగ పిల్లలకందరికి రాఖీలు కట్టగా వారు ఒకరికొకరు స్వీట్స్‌, చాకోలెట్స్‌, కేకులు పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సెక్రటరీ కరస్పాండంట్‌ సుభద్రరాజు, మరియు ఝాన్సీ రంగారావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంబించగా అతిధులు అందరు కీ.శే. డా.చెన్నకేశవు రంగారావు చిత్ర పఠమునకు పూలమాలతో నివాళి అర్పించిన అనంతరం డా.ఏ.వి.ఎన్‌.రాజు రచించిన కథలు అనే పుస్తకాన్ని రాము సూర్యారావు ఆవిష్కరించారు. అనంతరం స్కూల్‌ హిందీ ఉపాధ్యాయిని లీల పుస్తకంలోని విషయాలను క్లుప్తంగా వివరించారు. వక్తల పిల్లలను ఉద్దేశించి సామాజిక సేవ, స్వచ్చ అలవాట్లు, లంచగొండి తనం నిర్మూలన వంటి విషయాల గురించి అవగాహన కల్పించి కీ.శే. డా.చెన్నకేశవు రంగారావు సేవలను కొనియాడారు. అనంతరం స్కూల్‌ చైర్మన్‌ డా.ఏ.వి.ఎన్‌.రాజు, సెక్రటరీ కరస్పాండంట్‌ సుభద్ర రాజు విచ్చేసిన అతిధును దుశ్శాలువ మరియు పూల బొకేతో సత్కరించారు. అనంతరం వైస్‌ ప్రిన్సిపాల్‌ కళ్యాణి ప్రసాద్‌ విచ్చేసిన అతిధులకు, మీడియాకి కృతజ్ఞతలు తెలియ చేస్తూ వందన సమర్పణ గావించిన అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగించారు అని స్కూల్‌ ఫస్ట్‌ ఇంచార్జ్‌ అనూష తెలియచేసారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *