కాటన్‌రాయుడు మాట్లాడడేంటి?

మహిళపట్ల ఉత్తరాంధ్ర మంత్రి అసభ్య ప్రవర్తన ___
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె సోమవారం మిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ పాలనలో మహిళలు అభద్రతా భావంతో ఉన్నారన్నారు. ‘కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌కు కారకులు ఎవరు?. మహిళలను హింసించే వారిని టీడీపీ పెద్దలు వెనకేసుకు వస్తున్నారు. చంద్రబాబు మంత్రుంతా కంత్రీలు, ఎమ్మెల్యేంతా కాల కేయుళ్లు. మహిళా సాధికారిత పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. రితేశ్వరి మరణానికి కారకులు ఎవరు…? ఉత్తరాంధ్ర మంత్రి మహిళల పట్ల అసభ్యంగా ప్రవ ర్తిస్తున్నారు. ఆ మంత్రిని చంద్రబాబు తక్షణమే పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలి. టీడీపీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాతుతామని మహిళలు కనకదుర్గమ్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేయాలి. మైనార్టీ మహిళలకు కూడా టీడీపీలో విలువలేదు. టీడీపీ నేతలకు రాఖీ శుభాకాంక్షలు చెప్పే అర్హత కూడా లేదు అని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎన్నిక సమయంలో ఎన్నో హామీలిచ్చి చంద్రబాబు అధికారంలోకి రాగానే గజినిలా మరిచిపోయారు. ఎంతమందికి రుణమాఫీ చేశారు. ఇళ్లు కట్టించారు. ఏ జిల్లాలో చేనేత పార్కులు ఏర్పాటు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ముడి సరుకుతో పాటు ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవ కాశం లేకుండా పోయింది. విదేశాల నుంచి 18మందిని తీసుకు వచ్చి వాళ్ల భోజనానికి రూ.18 లక్షలు ఖర్చు చేసిన చంద్రబాబు ఇక్కడ చేనేతలు పడుతున్న కష్టం కనపడలేదు. చేనేతకు నేనే బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటున్న పవన్‌ కళ్యాణ్‌ చేనేత సమస్యపై ఎందుకు స్పందించడంలేదు. కాటమరాయుడు సినిమా రిలీజ్‌ సందర్బంలో తాను కాటన్‌రాయుడునని పవన్‌ పబ్లిసిటీ చేసుకున్నారు. వైఎస్‌ జగన్‌ మాటిస్తే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మాటిచ్చినట్లే. మాట తప్పరు, మడం తిప్పరు. వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే చేనేత సమస్యను పరిష్కరిస్తారు.’ అని హామీ ఇచ్చారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *