నాయీ బ్రాహ్మణులకు కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలి

యువసేన జిల్లా అధ్యక్షులు కొడవర్తి శివప్రసాద్‌నంద డిమాండ్‌
గోపాలపురం : రాష్ట్ర ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు ఫెడరేషన్‌ రద్దు చేసి కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలని నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా యువసేన అధ్యక్షులు కొడవర్తి శివప్రసాద్‌ ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. మండలంలోని దొండపూడిలో నంద నాయీ బ్రాహ్మణ నియోజకవర్గ చైతన్య సదస్సు సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిదిగా పాల్గొన్న శివప్రసాద్‌ మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్ట మొదటి వైద్యులు నాయీ బ్రాహ్మణులేనని అటువంటి నాయీ బ్రాహ్మణులకు సరైన గుర్తింపు లేదన్నారు. ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఎదిగినప్పుడు మన జాతి అభివృద్ధి చెందుతున్నారు. యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ సూర్యనారాయణనంద మాట్లాడుతూ రాష్ట్రంలో 10 వేల మందితో నాయీ బ్రాహ్మణ యువసేన దళం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తిరుపతిలో వచ్చే తలనీలాలు ఆదాయంలో 10 శాతం నాయీ బ్రహ్మణులకు కేటా యించాలని, రాష్ట్రంలోని అన్ని గ్రామాలలోనూ స్మార్ట్‌ సెలూనులు ఉచితంగా ఏర్పాటు చేయాలని, క్షౌర శాల విద్యత్‌పై ప్రభుత్వం రాయితీ కల్పించాలని ఆయన డిమాండ్‌ చేసారు. రాష్ట్ర అధ్యక్షులు ఇంటూరి బాబ్జి నంద ఆధ్వర్యంలో లక్షల మంది నాయీ బ్రాహ్మణులతో రాజధానిలో యువగర్జన ఏర్పాటు చేస్తామని అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాము కావాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో ఎంఎల్‌ఏ సీట్లు రెండు ఎంఎల్‌సీ రెండు సీట్లు కేటాయించాని కోరారు. అనంతరం దొండపూడిలో పలు సేవాకార్యక్రమాను నిర్వహించిన అరిగె రామకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు కడియం శ్రీను, రుషినంద, చీపురపల్లి నాగేశ్వరరావు, ఆచంట మహాబూబ్‌, పెంటపాటి గనిరాజు, కె కోటేశ్వరరావు, అయ్యంకి శ్రీను, నాగేశ్వరరావు, నంద పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *