ప్రజాప్రతినిధుల కోసం అధికారుల ఎదురుచూపులు

 

15 పాఠశాలలు మోడల్‌ స్కూళ్లుగా అభివృద్ది
విద్యార్ధులను గైడులు చదవమని ప్రోత్సహించటం సహించరానిది..
జడ్‌పి బాలికల హైస్కూలుకు కిచెన్‌, డైనింగ్‌ హాలు భవనానికి నిధులు మంజూరు———–

కొయ్యలగూడెం : మండలంలో వానలు సాధారణ వర్షపాతం కంటే తక్కువగా ఉందని, చెరువు నిండలేదని అందువల్ల వరినాట్లు 70 విస్తీరణలో పడ్డాయని మండల వ్యవసాయాధికారి పోశారావు తెలిపారు. స్ధానిక మండల పరిషత్‌ కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీపీ అయిన పర్తి చందన శ్రీదేవి అధ్యక్షతన మండల పరిషత్‌ సర్వసభ సమావేశం జరిగింది. సమావేశంలో వ్యవసాయ ప్రగతి సమీక్ష సందర్భంగా ఆయన మండలంలో తొలకరిసాగు పరిస్ధితిని వివరించారు. అరకొర వర్షాలు కారణంగా రైతు వరికి బదులు మొక్క జొన్న సాగు పట్ల మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. గత ఏడాది 220 హెక్టర్లలో మొక్కజొన్న పండించగా ప్రస్తుతం తొలకరిలో 317 హెక్టర్ల విస్తీరణలో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారని వ్యవసాయాధికారి వివరించారు. తాహశీల్దార్‌ ఆకుల కృష్ణజ్యోతి రెవెన్యూ శాఖ ప్రగతి కార్యక్రమాలను వివరిస్తూ కొయ్యలగూడెంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు పరింపూడి రెవెన్యూ గ్రామ పరిధిలో 3.44 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, భూమి కేటాయించిన విషయాన్ని జిల్లా కలెక్టరుకు నివేదిక పంపామని తెలిపారు. మండలంలో కొత్తగా ఓటర్లుగా నమోదు కోసం 800 మంది ధరఖాస్తు చేసారని పేర్కొన్నారు. మండలంలో 18, 19 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు 1400 మంది వరకు ఉన్నట్లు సామాజిక సర్వే ద్వారా వెల్లడయిందని ఆమె అన్నారు. కనీస భూవసతి లేని ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలు మండలంలో 2300 ఉన్నాయని ఎవరైన రైతులు, భూస్వాములు భూములు అమ్మితే ప్రభుత్వం కొనుగోలు చేసి భూమిలేని ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలు వారికి ఉచితంగా ఇవ్వటానికి నిర్ణయించిందని తాహశీల్దార్‌ చెప్పారు. నివేదన స్ధలాలు, ఇళ్లులేని పేదలకు ఇళ్ల స్ధలాలు పంపిణీకి సంబంధించి కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. గతంలో కేటాయించిన ఇళ్ల స్ధలాలు, నిరుపయోగంగా ఉన్నట్లయితే వాటినన్నింటిని గుర్తించి, కొత్తగా మళ్లి లేఅవుట్‌ చేసి ఆగస్టు నెలాఖారు నాటికి అర్హులైన లబ్దిదారులకు ఆ స్ధలాలకు పట్టాలు ఇచ్చి వారికి అప్పగించడం జరుగుతుందని కృష్ణజ్యోతి సమావేశంలో సభ్యులకు వివరించారు. ఎంఇఓగా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న కొయ్యలగూడెం విద్యా డివిజన్‌ డివై ఇఓ సురేష్‌ బాబు విద్యావనరులు, విద్యాభివృద్ధి ప్రగతిని వివరిస్తు మండలంలోని 15 పాఠశాలను మోడల్‌ స్కూళ్లుగా గుర్తించి ఆ స్ధాయిలో అభివృద్ధి పరుస్తున్నాట్లు తెలిపారు. కొయ్యలగూడెం జడ్‌పి బాలిక హైస్కూల్‌కు కిచెన్‌కమ్‌ డైనింగ్‌ హాలు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. దీర్ఘకాలంగా నిర్మాణంలో ఉండి యేడాది గడుస్తున్నా పూర్తికాని పాఠశాలలో 24 అదనపు తరగతి గదుల భవనాలు త్వరిత గది పూర్తి చేసే విషయమై మండల పరిషత్‌ సమావేశం ఆదేశాలను సర్వ శిక్షా అభియాన్‌ జిల్లా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లగలనని ఆయన చెప్పారు. కొన్ని పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు అన్ని సబ్జక్టుకు గైడు కొన్ని చదవమని, లేకుంటే కుదరదని వత్తిడి చూస్తున్న విషయాన్ని బోడిగూడెం ఎంపిటిసి సభ్యులు కూనపాటి అబ్బు ప్రస్తావించిన అంశంపై డివైఇవో సురేష్‌ బాబు స్పందించారు. పాట్రాన్‌లో విద్యా వ్యవస్ధ విధానం నడుస్తున్నందున గైడుపుస్తకాలను విద్యార్ధులు అనుసరించినవలసిన అవసరం ఉండదని ఆయన సృష్టిం చేసారు. గైడు పుస్తాకాలు అనుసరిస్తే ఇక.. ఉపాధ్యాయులు వారికి నిత్యం నూతన విద్యాబోధన అంశాంపై నిరంతం అవగాహన తరగదులు నిర్వహించి ప్రయోజనం ఏమిటని అన్నారు. విద్యార్ధులను గైడు పుస్తకాలు కొనమని కానీ, వాటినే చదివి అనుసరించాలని కాని ఉపాధ్యాయులు ప్రోత్సహింటానికి సహించేదిలేదని డివైఇవో స్పష్టం చేసారు. ఎన్‌టిఆర్‌ గృహవసతి ఇళ్ల లబ్ధిదారులకు దశలవారీగా బిల్లులు చెల్లింపు విషయంలో గృహనిర్మాణ సంస్ధ అధికారులు తీవ్ర ఇబ్బందు పెడుతున్నారని బిల్లు చేసిన ప్రతిసారి ఇంటి స్ధలానికి సంబంధించిన ఎంజాయ్‌మెంటు సర్టిఫికేట్‌ అడుగుతున్నారని ఎంపిటిసి అబ్బులు నిలదీసారు. మధ్యాహ్నం 2 గంటకు సమావేశం ప్రారంభమవుతుందని అజెండాలో అధికారులు పేర్కొన్నప్పటికే ప్రజాప్రతినిధు 2.45 గంట వరకు రాలేదు. కొందరు ఎంపిటిసి సభ్యులు అధికారు వచ్చిన సమావేశంలో కూర్చొని ఎదురుచూసారు. 2.50 గంటకు ఎంపిపి చందన శ్రీదేవి, జడ్‌పి వైస్‌చైర్‌పర్సన్‌ చింత వెంకటరమణ రావటంతో 2.55 గంటకు ఎంపిడివో ఎం రాజు సమావేశాన్ని ప్రారంభించారు. ప్రారంభసమయానికి 11 మంది ఎంపిటిసి సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత మరో నాలుగురు వచ్చారు. 6 గురు ఎంపిటిసి సభ్యులు గైరాజరు అయ్యారు. మూడు సంవత్సరాలు గడచిన ఎంపిటిసి సభ్యులలో కొందరు ఇంకా గాడిన పడలేదని విమర్శులు ఉన్నాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *