స్నేహమే జీవితాంతం నిలుస్తుంది

ఏలూరు : స్నేహమే జీవితాంతం నిుస్తుందని ప్రతీమనిషి స్నేహానికి ఇచ్చిన విలువ డబ్బుకు కూడా ఇవ్వరని రాష్ట్ర హస్తకళ అభివృద్ధి ఛైర్మన్‌ పాలి ప్రసాద్‌ చెప్పారు. స్ధానిక పవర్‌ పేటలోని అంబికా స్నేహ నిలయంలో సోమవారం ఫ్రెండ్‌షిప్‌ డే వేడుకలను పాలి ప్రసాద్‌ ప్రారంభించారు. స్నేహం అసోసియేషన్‌ అధ్యక్షులు అంబికా రాజా కేక్‌ కట్‌ చేసి స్నేహబంధాన్ని తెలిపే కంకణాన్ని పాలిప్రసాద్‌కు కట్టారు. ఈ సందర్భంగా పాలి ప్రసాద్‌ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి సమాజంలో ఎంతో మందితో స్నేహం చేస్తామని స్నేహాన్ని మించిన గొప్పతనం మరొకటి లేదని చెప్పారు. చిన్నప్పటి నుండే ప్రతీ మనిషీ మంచి స్నేహితులను ఎంచుకుని వారితో జీవనం సాగిస్తే భవిష్యత్తెంతో బాగుంటుందని పాలి ప్రసాద్‌ సూచించారు. స్నేహం అసోసియేషన్‌ అధ్యక్షులు అంబికా రాజా మాట్లాడుతూ స్నేహంలో ఉన్న గొప్పతనం ధనసంపాదనలో కూడా ఉండదని చెప్పారు. స్నేహ మాధుర్యం వర్ణనాతీతమని ప్రతీ మనిషీ స్నేహానికి ఎంతో విలువిస్తారని కుటుంబ సభ్యుల మాటకన్నా స్నేహితుల మాటకే అధిక ప్రాధాన్యతిచ్చే స్నేహబంధం మన సమాజంలో కొనసాగుతుందని ఇది మంచి పరిణామమని అంబికా రాజు చెప్పారు. సమాజంలో ప్రతీ మనిషీ మచ్చలేని జీవితాన్ని గడుపుతూ స్నేహితుల అభివృద్ధిని కోరుకుంటూ ముందుకునడవాని ఆయన కోరారు. ఆధునిక యుగంలో ప్రతీ ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలని చెడు స్నేహా వలన పరువు పోవడమే కాకుండా జీవన స్ధితిగతులు కూడా దెబ్బతింటాయని కావున నేటి యువత సన్మార్గంలో నడుస్తూ మంచి స్నేహితులతో ముందుకు సాగాలని అంబికా రాజా కోరారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *