హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జువైనల్‌ హోమ్‌లో రాఖీ సంబరాలు

పరివర్తన తీసుకురావడమే ముఖ్యోద్దేశం : అధ్యక్షులు పెద్దిరెడ్డి ప్రదీప్‌

 

ఏలూరు: ఏలూరు హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు పెద్దిరెడ్డి ప్రదీప్‌ ఆధ్వర్యంలో స్థానిక శనివారపుపేటలో వున్న ‘జువైనల్‌హోమ్‌’లో రాఖీ పర్వదినం సందర్భంగా జింగిల్‌ బెల్స్‌ స్కూల్‌ విద్యార్ధినితో హోమ్‌లో గల 165 మంది బాలురకు రాఖీలు కట్టించి తెలిసి తెలియని వయస్సులో చిన్నచిన్న తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్న బాలురకు మేమున్నమన్న భరోసా కల్పించి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటిచెప్పి వారిలో పరివర్తన తీసుకురావడం ముఖ్యోద్ధేశ్యంతో మంచి ఆలోచనతో ఉన్నత స్థాయి అధిరోహించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అధ్యక్షులు ప్రదీప్‌ అన్నారు. హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ సెక్రటరీ మాట్లాడుతూ పిల్లలను చైతన్యవంతులను చేయడం ద్వారా సత్ప్రవర్తన కలిగి భావితరాలకు ఆదర్శంగా తయారవ్వాలని విజయలక్ష్మీ చౌదరి అన్నారు. ఈ సందర్భంగా బాలురు ఉత్సాహంగా పాల్గొని రక్షాబంధన్‌ యొక్క విలువను తెలుసుకుని అన్నాచెల్లెళ్ల విశిష్టతను తెలుసుకుని వారిలో నైతిక విలువలు మెరుగుపడతాయని మెంబరు ఉప్పలపాటి నాగవెంకట సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్ర్రమంలో జింగిల్‌ బెల్స్‌ స్కూల్‌ చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని హోమ్‌లోని బాలురకు రాఖీలు కట్టడంతో బాలురు చాలా ఆనందంగా గడిపారు. రాఖీలు కట్టిన తర్వాత బాలురకు లయన్స్‌ క్లబ్‌ సభ్యులు మిఠాయిు పంచారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ సభ్యులు వడ్లపూడి కృష్ణమోహన్‌, ప్రగడ సురేష్‌, నరసింహం తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *