ఉపాధ్యాయుడి పనితీరు బదిలీపై వెళ్ళినప్పుడు తెలుస్తుంది

గంగోలు సర్పంచ్‌ ఝాన్సీ—–
గోపాలపురం, (పశ్చిమ గోదావరి జిల్లా): పనితీరు ఆ ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లినప్పుడు మాత్రమే తెలుస్తుందని గంగోలు సర్పంచ్‌ బేదంపూడి ఝాన్సీ అన్నారు. మండలంలోని హుకుంపేట ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎం కె వరప్రసాద్‌ బదిలీ చేయడంతో మంగళవారం ఆయనను సర్పంచ్‌ ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న సర్పంచ్‌ ఝాన్సీ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలు పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేసి విద్యార్ధుల ఉన్నతికి వరప్రసాద్‌ ఎనలేని కృషి చేసారన్నారు. పనితీరు కల్గిన ఉపాధ్యాయులకు ఎక్కడ ఉన్న ఉన్నతంగానే ఆలోచిస్తారని ఆమె కొనియాడారు. హెచ్‌ఎం వరప్రసాద్‌ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తుల భాగస్వామ్యం కావడం ఎంతో అభినందనీయమన్నారు. ఎక్కడ ఉన్న ఉపాధ్యాయుడు విద్యాబోధనకే అంకితం కాకుండా విద్యార్ధులను అన్ని రంగాలలోనూ ఉన్నత స్ధితికి తీసుకువెళ్ళాలన్నాదే ఆకాంక్ష అని అన్నారు. అనంతరం వరప్రసాద్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమం ఉపాద్యాయులు నూతంగి శ్రీనివాసరావు, తానేటి రవి, కె రామాంజనేయు, ఎన్‌ పార్వతి, డి రాంబాబు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *