జగన్‌ది ఉన్మాదం గాక మరేమిటి?

అమరావతి : నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలతో ఈరోజు ఆయన టెలీ కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరువ చేసే బాధ్యత పార్టీ నేతలదేనని పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ప్రతి ఒక్కరూ ఇప్పట్నుంచే సమాయత్తం కావాలని సూచించారు. ప్రతిపక్ష నేతలు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలకు కార్యకర్తలెవరూ స్పందించవద్దని వారి సంగతి ప్రజలే చూసుకుంటారన్నారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఉన్మాదిలా ప్రవర్తిస్తుంటే.. అధికారంలోకి వస్తే ఎలా ఉంటాడో ప్రజలే బేరీజు వేసుకోవాలన్నారు. ‘సీఎంను చెప్పుతో కొట్టాలి, నడిరోడ్డుపై కాల్చి చంపాలి, కలెక్టర్‌ను జైలుకు పంపిస్తా, పోలీస్‌ కమిషనర్‌ పింఛన్‌ ఆపేస్తా’ అంటూ వ్యాఖ్యలు చేయడం ఉన్మాదం కాక మరేమిటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌ ఉన్మాది అనడానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా 30 సీట్ల కంటే ఎక్కువ గెలిచేది లేదని సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. వైకాపా నేత వ్యాఖ్యలే వారిని ఓడిస్తాయని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా సంయమనం పాటించాలని చంద్రబాబు సూచించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *