డిప్యూటీ కలెక్టర్‌గా విధులు చేపట్టిన సింధు (diffute collector gaa vidhulu chepattina sindhu)

విజయవాడ: బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని గోల్లపూడిలో ఉన్న ఏపీ భూపరిపాలన(సీసీఎల్‌ఏ) కమిషనర్‌ కార్యాయానికి చేరుకున్న సింధు ఉద్యోగంలో చేరుతున్నట్లు సీసీఎల్‌ఏ ప్రధాన కమిషనర్‌ పునేఠాకు రిపోర్ట్‌ చేశారు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రూప్‌-1 ఉద్యోగం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమెను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియామక పత్రాన్ని అందజేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *