పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి (patasalalaku moulika vasathulu kalpinchali)

గోపాలపురం, (పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రతి పాఠశాలలోనూ విద్యార్ధులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని రికార్డు పరంగా హెచ్‌ఎంలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంకల్పం సభ్యులు అసిస్టెంట్‌ ఏఎంఓ కె. శరత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని భీమోలు, గోపవరం, గంగోలు పాఠశాలలో మంగళవారం బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్ధులు విద్యా ప్రమాణాలు పెరగాని, విద్యార్ధులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన ఉండాలని అటువంటి పాఠశాలను అత్యుత్తమ పాఠశాలలుగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పాఠశాల పనితీరు ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేసిన పాఠశాల ఉపాధ్యాయులకు కలెక్టర్‌ ద్వారా ప్రశంసాపత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండలం విద్యాశాఖ అధికారి జి. శ్రీనివాసరావు, ఈఆర్‌పీలు కొయ్యనాగరాజు, పి సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *