మద్యం షాపును వ్యతిరేకిస్తూ మహిళాలు ఆందోళన (madhyam shop nuu vyathiraykesthuuu mahilalu aandholana)

నిబంధనలకు విరుద్దంగా షాపు—
బెల్టు షాపు నిర్వహిస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదు—
షాపుకు తాలాలు వేసి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్‌ అధికారులు—
ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా): ప్రజలు నివశిస్తున్న చోట బ్రాందిషాపు పెట్టోదంటూ హానుమాన్‌నగర్‌లో ప్రజలు బ్రాందిషాపు వద్ద ధర్నా నిర్వహించారు. వెంకటాపురం పంచాయితీలో గల హనుమాన్‌నగర్‌ నందు ఏర్ఫాటు చేస్తున్న బ్రాందిషాపు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక ప్రజలు ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్థానిక మహిళలు మాట్లాడుతూ హనుమాన్‌ నగర్‌లో ఇప్పటికి 4, 5సార్లు ఆందోళన చేసామని అన్నారు. గతంలో ఏలూరు ఎమ్‌.ఎల్‌.ఎ వచ్చి బ్రాందిషాపు ఇక్కడ పెట్టోదని షాపు యజమానికి వార్నింగ్‌ ఇచ్చి వెల్లారని దానితో షాపు మూసివేసారన్నారు. మరల ఇపుడు షాపు యజమాని అదే ప్రాంతంలో వైన్‌షాపు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. షాపు పెట్టే ప్రాంతం హనుమాన్‌నగర్‌కు ప్రదాన రహదారని, స్కూల్సుకు, కాలేజ్‌లకు ఆడపిల్లలు ఇటు వైపే వెల్లివస్తుంటారని, మహిళలు పనులకు, మార్కెట్‌తో సహ ఏలూరు టౌన్‌కు ఏ పనులకు వెల్లాన్నా ఇదే దారి అని, ఇపుడు వైన్‌ షాపు ఇక్కడ పెట్టడం వల్ల మహిళంతా చాలా ఇబ్బందులు పడతామన్నారు. వెంటనే హనుమాన్‌నగర్‌లో వైన్‌షాపును ఎత్తివేయాలని డిమాండ్‌ చేసారు. ఈమేరకు అక్కడకు వచ్చిన ఎక్సైజ్‌ ఎస్‌ఐ ను స్థానికుంతా నిలదీసారు. ఇప్పటికే ఇక్కడ షాపు పెట్టవద్దని 4, 5సార్లు ధర్నాలు చేసిన అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ప్రతిసారి ఎక్సైజ్‌ అధికారులు రావటం షాపు అపటం తిరిగి కొన్నిరోజుల తర్వాత మరల షాపు పెట్టడం షరామాములే అవుతుందని, అధికారులు వైన్‌షాపు వల్లతో కుమ్మక్కు అయ్యారా అని అనుమానించాల్సి వస్తుందన్నారు. ఎమ్‌పిటిసి రజినికుమార్‌, పంచాయితీ వార్డుమెంబర్లు పండు కళ్యాన్‌, శ్రీను, స్థానిక పెద్దలు తుకా సత్యనారాయణ, షేక్‌ వలి, శీం పోతురాజు, ఆర్‌.సూర్యనారాయణ తదితరులు నాయకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్వతి, అంబికాంబ, నాగమణి, కుమారమ్మ, పాపారత్నం, పర్వీన్‌, భవానిలు సిపిఎం హనుమాన్‌నగర్‌ కార్యదర్శి పి.సత్తిరాజు, నగరకమిటి సభ్యు వి.సాయిబాబు, జిల్లానాయకు ఎమ్‌.శ్రీనివాస్‌ ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. మద్యం షాపును హనుమాన్‌నగర్‌ నుండి తరలించాలని పెద్ద పెట్టున నినాదాలు చేసారు.
నిబంధనలకు విరుద్దంగా హనుమాన్‌ నగర్‌ వైన్‌షాపు
హనుమాన్‌నగర్‌లో వైన్‌షాపు పెడుతున్న ప్రాంతం ఇరిగేషన్‌ రోడ్డు పోరంబోకు స్ధలం అని, పోరంబోకు స్థలాలు ప్రజలు నివశించటానికి మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని దానిని వ్యాపార ప్రయోజనాలకు వాడకూడదన్నారు. ఇదే విషయం పత్రికలో కూడా వచ్చిందని స్థానికులు అన్నారు. అటువంటి దానికి ఎక్సైజ్‌ అధికారులు ఎలా అనుమతి ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా వైన్‌షాపు యజమాని ఒక ఇల్లు అద్దెకు తీసుకొని పక్క ఇంటిలో కూడా మందు బాటిల్స్‌ పెట్టి పక్కనే బెల్టు షాపు కూడా రన్‌ చేస్తున్నారని మీడియా సాక్షిగా ఆ ఇంటి తలుపులు తీయించి స్థానికులు ఎక్సైజ్‌ అధికారులకు పట్టించారు. షాపు నిర్వాహకులు దాచిన మందు బాటిల్స్‌ను వేరే చోటకు తరలించబోతే మీడియా, ప్రజలు అడ్డుకున్నారు. దానితో చేసేదేమి లేక ఎక్సైజ్‌ ఎస్‌.ఐ అక్రమంగా నిల్వ చేసిన మందు బాటిల్స్‌ను, ఇంటికి తాలాలు వేయించి స్వాదీనం చేసుకున్నారు. దీనిపై షాపు యజమాని, ఇంటి యజమానిపై కూడా క్రిమినల్‌ కేసు పెట్టాలని వ్రాత పూర్వకంగా స్థానికులు పిర్యాదు చేసారు. ఆ పిర్యాదును ఎక్సైజ్‌ సూపరిడెంటు, ఎక్సైజ్‌ డిసి ,ఎక్సైజ్‌ సిఐకు ప్రజలు అందించారు.
ఐద్వా మద్దతు
హనుమాన్‌నగర్‌ వైన్‌షాపు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి ఐద్వా మద్దతు తెలిపింది. ఈసందర్బంగా ఐద్వా జిల్లా నాయకులు జి.విజయక్ష్మీ, పి.హరీషదుర్గ మాట్లాడుతూ ప్రజలు నివశించే చోట వైన్‌షాపు పెట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్‌శాఖ మంత్రి, జిల్లాకలెక్టర్‌ పదేపదే ఇదే చెబుతున్నా, హనుమాన్‌నగర్‌లో ప్రజలు నివశించే చోట ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. దీన్ని ప్రభుత్వం, మంత్రి, జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెతామని హెచ్చరించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న చోట వైన్‌షాపులకు ఎక్సైజ్‌ శాఖ అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్‌ చేసారు. హనుమాన్‌నగర్‌లో ప్రజలు వ్యతిరేకిస్తున్న వైన్‌షాపు విషయంలో జిల్లా అధికారులు జోక్యం చేసుకోవాలని అన్నారు. లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *