మధ్యం తిరనాళ్లు… ఆగని గొలుసు దుకాణాలు..! (madhyam thirunalu.. aagani golusu dhukanalu..!)

రోడ్లల మీదే మధ్యపానం—
విచ్చలవిడిగా విసిరేస్తున్న ఖాళీ సీసాలు—
మందు బాబుల వికృత చేష్టులు–
దుకాణాల పరిసర ప్రాంత గృహాల వారు బెంబేలు—
రామదుర్గా సినిమా హాలు ప్రాంతంలోని దుకాణం వద్ద రద్దీ—
ఆర్‌ఆండ్‌బి రహదారిపై రాకపోకలకు ప్రజల ఇబ్బందులు—
శాంతి భద్రతలను పట్టించుకోని పోలీసులు—
కొయ్యగూడెం, (పశ్చిమ గోదావరి జిల్లా): సుబ్రహ్మణ్య స్వామి షష్టికి, మహాశివరాత్రికి, వినాయక చవితికి, దసరా నవరాత్రి ఉత్సవాలప్పుడు రాత్రి పగులు తిరనాళ్ల జరగటం, చిన్నా… పెద్దా అందరూ తిరనాళ్లకు వెళ్లి ఆ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఆస్వాదించటం మనకు తెలుసు కానీ… కొయ్యలగూడెంలో సాగుతున్న మధ్యం తిరనాళ్లు మాత్రం ప్రజలకు ఇబ్బంది కరంగా మారాయని సర్వత్రా విమర్శులు వెలువెత్తుతున్నాయి. దుకాణాలు పరిసర ప్రాంత నివాసాల వారిని మధ్యం బాబులు వికృత చేష్టలు బెంబేలెత్తిస్తున్నాయి. మందు బాబులు రాత్రిళ్లు మందు సీసాలు కొనితెచ్చుకొని రోడ్డు మీద, రోడ్డు ప్రక్క నివాసాల వాని గృహాల అరుగు మెట్ల మీద త్రాగటం ఖాళీ సీసాలను ఇష్టారాజ్యంగా విసిరివేయటం రోడ్డు మీద ప్రయాణించే వానికి భయభ్రంతులను చేయటంతో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొయ్యలగూడెంలోని నల్లరోడ్‌ (ఆర్‌అండ్‌బి రహదారి) ప్రక్కనే రామదుర్గా సినిమాహాలు ప్రాంతంలో మూడు వరుస గదులలో మధ్యం దుకాణాలు గత జూలై ప్రారంభంలో వెలిసాయి దానిలో ఒక గదిలో సిట్టింగ్‌ అనుమతులు కూడా ఉన్నాయి. ఈ దుకాణాల వద్ద ఉదయం 10 గంట నుంచి రాత్రి 1 గంట వరకు మధ్యం కొనుగోలుకు, సేవించటానికి వచ్చి, పోయే వారిలో తీవ్ర రద్దిగా ఉంటోందని, మధ్యం దుకాణానికి వచ్చే వారు తమ ద్విచక్ర వాహనాలను, ఆటోలను నల్లజర్ల రోడ్‌కు ఇరువైపు మార్జిన్‌పై అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేస్తున్నారు. దుకాణాల ముందు రోడ్డు మార్జిన్‌పై చోటు చాలక ఆర్‌అండ్‌బి రహదారిపైనే ఇష్టారాజ్యంగా వాహనాలను నిలిపివేస్తున్నారని బస్సులు, లారీలు, ప్రయాణీకుల ఆటోలు, ద్విచక్ర వాహనదారులు ఇక్కడ నిలిచిన వాహనాల రద్దీతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి ఇబ్బందులు పడవలసి వస్తోందని ప్రయాణికులు భయపడుతున్నారు. సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రోడ్డుపైనా, మార్జిన్‌లోను వాహనాలు అడ్డదిడ్డంగా నిలిపివేయటం వల్ల ద్విచక్ర వాహనదారులు, మహిళలు ఈ మార్గం వైపు ప్రయాణించటానికి భయభ్రాంతులు అవుతున్నారని ఆందోళన చెందుతున్నారు.సాయంత్రం 5 గంట నుంచి 10 గంటల వరకు ఈ మధ్యం దుకాణానికి ఇరువైపుల వంద మీటర్ల వరకు మధ్యం బాబులు తిరనాళ్లు, యద్ధేచ్ఛ పోకడలు ప్రయాణికులు, రోడ్డు ప్రక్కన ఉన్న గృహాలకు చెందిన నివాసాల వారు, ఇతర వ్యాపార దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపైనా, మార్జిన్‌లోను నివాసాల ముందు ఎక్కడ చూసినా ఖాళీ మధ్యం సీసాలే ఉంటున్నాయని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మధ్యం సీసాలతో పాటు మధ్యం త్రాగిన ప్లాస్టిక్‌ గ్లాసులు గుట్టల గుట్టులుగా పడి గాలికి చెల్లచెదురుగా ఎగురుతున్నాయి. మధ్యం దుకాణానికి పక్కనే ఇరువైపుల వడులు, బజ్జిలు, బిర్యానీ, చికెనె పకోడి దుకాణాలు రోడ్డు మార్జిన్‌లో వెలిసాయి ఈ తినుబండారాలు దగ్గర కూడా మందుబాబులు గుంపుగా చేరుతుండటంతో ట్రాఫిక్‌ సమస్య మరింత గా మారుతోందని అంటున్నారు. మందుబాబుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి రాత్రిల్లో 10 గంటలు దాటిన తర్వాత కూడా మధ్యం దుకాణం సిట్టింగ్‌ గది తెరిచి ఉంచి మధ్యం అమ్మకాలు సాగిస్తున్నారు. మండల కేంద్రం కొయ్యలగూడెంలోను, మరికొన్ని కీలక గ్రామాలలోను మధ్యం గొలుసు దుకాణాలు ఆగకుండా కొనసాగుతుండటం ప్రోహిబిషన్‌ శాఖ అధికారులకు తెలియకుండా ఉండదు. అయినా కొన్ని చోట్ల ఊరికి దూరంగా పొలాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదులో ఉదయం 7 గంట నుండి ఆర్ధరాత్రి వరకు గొలుసు దుకాణాలు, మాంసాహార పదార్ధాల శాలలు యధేశ్చగా సాగుతుండటం మధ్యం తిరనాళ్లు తీరును తేటతెల్లఁ చేస్తుంది. గొలుసు దుకాణాలను కట్టడి చేయడంలో ప్రోహిబిషన్‌ అధికారులు విఫమయ్యారా.. లేక కుమ్మక్కయ్యరా అనే విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొయ్యలగూడెంలో మధ్యం షాపు వద్ద, షాపు పరిసర ప్రాంతాలలోను మధ్యంబాబులు వల్ల ప్రజలకు ఇబ్బందులు, రోడ్డుపై ప్రజల రాకపోకలకు సమస్యలు ఏర్పడి తరచు శాంతి భద్రత సమస్య తలెత్తుతున్నప్పటికే కొయ్యలగూడెం పోలీసులు పట్టించుకోవటం లేదని విమర్శులు సర్వత్రా వినిపిస్తున్నాయి ఇక్కడ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లేక పోవటం, సిబ్బందిపై యజమయిషే నిఘా లేకపోవటంతో ఇక్కడి పోలీస్‌స్టేషన్‌ యాజమాని లేని ఇంటి మాదిరిగా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శులు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్‌ నియంత్రణలోను, అతిభద్రతను గాలికి వదిలేసారన్న అభిప్రాయం ప్రజలలో వ్యక్తం అవుతోంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *